జాతీయ వార్తలు

ఇదీ మా అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 12: విమానాలు, రహదారులు, రైలు మార్గాల ద్వారా అన్ని విధాలా సంధానత పెంచిన తమ ప్రభుత్వం సముద్ర మార్గాలను కూడా రవాణా కోసం వినియోగంలోకి తెస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇదంతా నూట ఇరవై అయిదు కోట్ల మంది భారత ప్రజల అభివృద్ధిని కాంక్షించి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమేనన్నారు. అహమ్మదాబాద్‌లో మంగళవారం జరగాల్సిన రోడ్ షో రద్దు కావడంతో ప్లాన్-బిలో భాగంగా ఆయన సముద్ర విమానం ఎక్కారు. గుజరాత్ ఎంతగా అభివృద్ధి చెందుతుందో దీని బట్టి అర్థం అవుతోందన్న ఆయన ‘ప్రతిపక్ష కాంగ్రెస్‌కు అభివృద్ధి అంటే దాన్ని సొమ్ము చేసుకోవడమే.. అందుకే ఆ పార్టీ నేతలు గుణాత్మకమైన మార్పును చూడలేకపోతున్నారు..’ అని అన్నారు.
అంబాజీ ఆలయంలో పూజలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర విమానంలో సబర్మతీ నది నుంచి ధరోయ్ జలాశయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన ప్రయాణించి బనాస్‌కాంత జిల్లాలోని అంబాజీ ఆలయానికి చేరుకున్నారు. అంబామాతకు నిర్వహించిన పూజల్లో మోదీ పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో బారులు తీరిన ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన దాదాపు పావుగంట సేపు గడిపారు. అహ్మదాబాద్ పశ్చిమ ప్రాంతంలోని సర్దార్ బ్రిడ్జి (సబర్మతి నది) వద్ద ఆయన సముద్ర విమానంలో ఎక్కి ధరోయ్ జలాశయానికి చేరుకున్నారు. అంబాజీ ఆలయ దర్శనం అనంతరం మోదీ తిరిగి సముద్ర విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. గుజరాత్‌లో 93 నియోజకవర్గాలకు ఈ నెల 14న రెండవ, చివరి దశ పోలింగ్ జరుగనున్నందున సోమవారం సాయంత్రం ప్రచార ఘట్టానికి తెరపడింది.

చిత్రం..గుజరాత్‌లోని అంబాజీ ఆలయంలో పూజలు చేస్తున ప్రధాని నరేంద్ర మోదీ