జాతీయ వార్తలు

అవినీతిపై వౌనమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 12: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యవహారశైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని ఆయన అన్నారు. పాకిస్తాన్ దౌత్యవేత్తలతో జరిగిన విందుకు మన్మోహన్‌సింగ్‌కు లింక్ పెట్టి పరోక్ష ఆరోపణలు చేయడం అత్యంత హేమయమైందని రాహుల్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్‌ను క్షమాపణ చెప్పాలంటూ ఉద్దేశపూర్వకంగానే మోదీ డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. గుజరాత్‌ను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న మోదీ రాష్ట్రంలోని అవినీతిపై మాట్లాడడానికి ఎందుకు వౌనం వహించారని కాంగ్రెస్ నేత నిలదీశారు. ‘బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షాపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రఫాలే యుద్ధ విమానాల డీల్‌లో షా అవినీతికి పాల్పడినట్టు కథనాలు వెలువడ్డాయి. అయినా ఒక్క ఎన్నికల సభలోనూ మోదీ ఆ విషయమే మాట్లాడారా?’ అని రాహుల్ ప్రశ్నించారు. తాను ఏ ఆలయాన్ని సందర్శిస్తాను? ఎక్కడకు వెళ్తాను అన్నదానిపైనే దృష్టిసారించి, విమర్శించడం ప్రధాని పనిగా పెట్టుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. గుజరాత్ ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తే మోదీకి వచ్చిన అభ్యంతరం ఏమిటని రాహుల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయాన్ని దర్శించుకోడానికి తనకు అర్హతలేదా?అని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్ర ప్రజల ప్రధాన సమస్యలను పక్కనబెట్టి వ్యక్తిగత అంశాలపైనే విమర్శలు చేయడం అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం కూడా గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉందని రాహుల్ స్పష్టం చేశారు. కాగా ఆదివారం పలన్‌పూర్ ఎన్నికల సభలో మాట్లాడిన ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ డిసెంబర్ 6న కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్తాన్ అధికారులతో సమావేశం అయ్యారని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీపై అయ్యర్ నీచ్ ఆరోపణలు చేయడానికి ముందు రోజే మన్మోహన్‌పై ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

చిత్రం..మంగళవారం అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయంలో పూజలు చేస్తున్న రాహుల్