జాతీయ వార్తలు

ఇలా అయితే కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: రాజ్యసభ సమావేశాల్లో ఇక మీదట అనవసర గందరగోళాలు, అల్లర్లకు ఆస్కారం లేకుండా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు నియమ, నిబంధనల ప్రకారం సమావేశాలు నిర్వహించి సభా గౌరవరం నిలబెట్టాలన్న దానిపై దృష్టి సారించారని అంటున్నారు. ఈ చర్య చీటికిమాటికి సభలో గొడవ చేసే సభ్యులకు ఇబ్బంది కలిగించేదేనని అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులకు గడ్డుకాలమేనని చెప్పవచ్చు. హమీద్ అన్సారీ రాజ్యసభ అధ్యక్షుడుగా కొనసాగినంత కాలం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు తమ ఇష్టానుసారం వ్యవహరించేవారన్న ఆరోపణలున్నాయి. ప్రతి చిన్న సమస్యపై పోడియం వద్దకు వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండేవారు. అన్సారీ సభ్యులను మందలించడమే తప్ప కఠిన చర్యలు తీసుకున్న సంఘటనలు తక్కువే. అయితే ఇప్పుడు రాజ్యసభలో పరిస్థితి మారబోతోంది. హమీద్ అన్సారీ పదవీ విరమణ తరువాత వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్ అయ్యారు. పెద్దల సభను దారిలోపెట్టి సత్‌సంప్రదాయాన్ని నెలకొల్పాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. ఈనెల 15ను నుంచి ప్రారంభం అవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆయన రాజ్యసభ నిర్వహణకు సంబంధించిన పూర్తి పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంటారు. పార్లమెంటులో గొడవ చేసే వారిని సస్పెండ్ చేయాలంటూ వెంకయ్యనాయుడు కొన్ని రోజుల క్రితం చేసిన ప్రకటన రాజ్యసభకు చెందిన ప్రతిపక్షం సభ్యులు ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది. అనేక సందర్భాల్లో పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడమే కాదు సభను స్తంభింపచేసిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఈ దృష్ట్యా ఒకవేళ చైర్మన్ ఆగ్రహానికి గురై సస్పెన్షన్ వేటు పడితే పరిస్థితి ఏమిటని తర్జన భర్జన పడుతున్నారు. ఇదే విషయాన్ని రాజ్యసభకు పలువురు కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కలిసి తమ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. వెంకయ్య కఠిన చర్యలు తీసుకుంటే అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించారని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో సీనియర్ సభ్యులు కపిల్ సిబాల్, పి చిదంబరం లాంటి వారిని రంగంలోకి దించాలని ఆజాద్‌కు సూచించినట్టు తెలిసింది. ఏ అంశంపైనేనా అందరూ కలిసే ముందుకు సాగాలని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చైర్మన్ ఏదైనా కఠిన నిర్ణయం తీసుకున్న పక్షంలో పార్టీ సమష్టిగా ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.