జాతీయ వార్తలు

అమర్‌నాథ్ వద్ద ఇక అంతా నిశ్శబ్దం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: కైలాస పర్వతంమీద కొలువైన అమరనాథ్ వద్ద భక్తుల మంత్రోచ్ఛారణలు, పారవశ్య నినాదాలు ఇంకెంతకాలమో సాగవు. త్వరలోనే వీటికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నట్టు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బుధవారం స్పష్టం చేసింది. అలాగే, అమరనాథ్ గుహలో ఇకపై ఎలాంటి జేగంటల శబ్దాలనూ అనుమతించేది లేదనీ స్పష్టం చేసింది. గ్రీన్ ప్యానెల్ ఆదేశాల మేరకు, అమరనాథ్ దర్శనానికి వెళ్లేమార్గంలో చిట్టచివరి చెక్‌పోస్టును దాటాక యాత్రీకుల వస్తుసామగ్రి, మెబైల్ ఫోన్లను ఇకపై దేవస్థానం అనుమతించదు. యాత్రికుల వస్తువులు భద్రపర్చుకోడానికి వీలుగా ప్రత్యేక స్టోర్‌రూం నిర్మించాలని అమరనాథ్ దేవస్థానాన్ని ఈ సందర్భంగా ఎన్జీటీ ప్యానెల్ ఆదేశించింది.
చిట్టచివరి చెక్ పోస్టు తరువాత యాత్రీకులను కేవలం ఒక్క లైనులో మాత్రమే అనుమతిస్తున్నట్టు ఈ సందర్భంగా బోర్డు కూడా గ్రీన్ ప్యానెల్‌కు వివరించింది. అమరనాథ్ దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ ఇటీవలే అమరనాథ్ దేవస్థాన బోర్డును ఎన్జీటీ ప్రశ్నించడం తెలిసిందే. ‘దేవస్థానం అతి సమీపం వరకూ తోవలో దుకాణాలను అనుమతిస్తున్నారు. అయితే, ఇక్కడెక్కడా మరుగుదొడ్ల సౌకర్యాలు లేవు. ఈ పరిస్థితి మహిళా భక్తులకు ఎంత నరకమో ఆలోచించారా? యాత్రీకులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు. వాణిజ్యపరమైన అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యత, భక్తుల సౌకర్యాలకు ఎందుకివ్వడం లేదు. ఇదెంత మాత్రం సహేతుకం కాదు. దేవస్థానానికి ఉన్న పవిత్రతను కాపాడండి’ అంటూ గత నవంబర్‌లోనే ఎన్జీటీ ఆదేశించడం తెలిసిందే.