జాతీయ వార్తలు

నిన్న విమర్శలు.. నేడు కరచాలనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పార్లమెంటుపై ఉగ్రదాడిలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ ఘన నివాళులర్పించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రదాది జరిగింది. మృతులకు నివాళులర్పించేందుకు అక్కడకు చేరుకున్న మోదీ, మన్మోహన్ సింగ్‌లు ఒకర్నొకరు పలకరించుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకున్న ఇరువురు నేతలూ బుధవారం అవన్నీ మరచిపోయి కరచాలనం చేసుకున్నారు. పార్లమెంట్ హౌస్ ప్రాంగణం వద్ద ఇది చోటుచేసుకుంది. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అమర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరవుతునే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారం పెట్టారు. తరువాత ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. ఇదంతా సోనియాగాంధీ ఆసక్తిగా గమనించడం కనిపించింది. కాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ, మన్మోహన్‌లు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. గుజరాత్‌లో బీజేపీని ఓడించడానికి పాకిస్తాన్‌తో మన్మోహన్ చేతులు కలిపారని మోదీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే మోదీ విమర్శలను మన్మోహన్ అదే స్థాయిలో తిప్పికొట్టారు. రాజకీయంగా ఎదుర్కొనలేక అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారని మన్మోహన్ విమర్శించారు. ఇలా ఉండగా 2001 డిసెంబర్ 13న ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు పార్లమెంటు కాంప్లెక్స్‌పై కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల కాల్పుల్లో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీ మహిళా అధికారి, ఇద్దరు పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ సిబ్బంది, ఓ తోటమాలి, కెమెరామెన్ మృతి చెందారు. బుధవారం మృతులకు నివాళులర్పించిన మోదీ ‘మీ త్యాగాలను జాతి మరచిపోదు’ అంటూ ట్వీట్ చేశారు.

చిత్రం.. పార్లమెంటుపై ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళులర్పించే కార్యకమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో
కరచాలనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రివర్గ ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు