జాతీయ వార్తలు

అప్పుల్లోనూ గొప్పోళ్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ‘యూపీఏ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. కాంగ్రెస్ పాలనలో కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయల రుణాలు అందాయి. నిజానికి ఇది 2జి, బొగ్గు, కామనె్వల్త్ గేమ్స్ కుంభకోణాల కంటే పెద్దది’ అని ప్రధాని నరేంద్ర మోదీ దుమ్మెత్తిపోశారు. నిన్నటి వరకూ గుజరాత్ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని, తాజాగా యూపీఏ పాలనపై ధ్వజమెత్తారు. ఫిక్కీ 90వ సమావేశానికి హాజరైన మోదీ మాట్లాడుతూ యూపీఏ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు, రాని బాకీలు దేశానికి ముప్పు తెచ్చిపెట్టాయన్నారు. ఆ గడ్డు పరిస్థితులను అధిగమించి ఎన్డీయే ప్రభుత్వం పేదల పక్షపాతిగా ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, జన్‌థన ఖాతాలు, యువతకు రుణాలు, పేదలకు సొంతిళ్లులాంటి పథకాలను 2014నుంచీ అమల్లోకి తెచ్చామన్నారు. ఎంపిక చేసిన పారిశ్రామికవేత్తలకు శక్తికిమించి రుణాలిచ్చేలా బ్యాంకులపై వత్తిడి తేవడం ప్రజాధనాన్ని లూటీ చేయడమేనని నరేంద్ర మోదీ యూపీఏపై దుమ్మెత్తిపోశారు. ఇదీ ఓ కుంభకోణమేనంటూ, 2జి స్పెక్ట్రమ్, కామనె్వల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణాల కంటే ఇది పెద్దది, ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. జిఎస్టీని అల్లోకి తేవడంతో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పెద్ద విజయం సాధించిందని, దీని అమలుతో సామాన్యులపై పన్ను భారం పూర్తిగా తగ్గిందన్నారు. గ్రామీణ ప్రాంతాలు సహా దేశం మొత్తంమీద 30కోట్లమందికి పైగా జన్‌ధన్ ఖాతాలు తెరిపించామని, ఎన్డీయే తీసుకున్న సంచలానాత్మక నిర్ణయాలతో ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపులోకి వచ్చిందని ప్రధాని మోదీ వెల్లడించారు. గత మూడేళ్లలో రక్షణ, ఆర్థిక, ఆహారోత్పత్తి రంగాల్లో 87 ముఖ్య సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలు, ఆసక్తులు దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం పథకాలను రూపొందిస్తుందని అన్నారు. ఇప్పటి వరకూ మూడు కోట్లమంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, దీంతో గ్రామీణ ప్రాంతాల్లో చమురు మాంద్యం పూర్తిగా తగ్గిందన్నారు. ‘పేదల సమస్యలు పరిష్కరించి ప్రగతి బాటన నడిపాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం’ అని ప్రధాని మోదీ ప్రకటించుకున్నారు. ముద్ర పథకం కింద 4 లక్షల కోట్ల రూపాయలను హామీలేని రుణాలుగా 9.75 లక్షల మంది యువతకు అందించామని ప్రధాని వెల్లడించారు. ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన దగ్గర్నుంచీ మూడు కోట్లమంది కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేశామని ప్రధాని మోదీ వెల్లడించారు.