జాతీయ వార్తలు

గాంధీనగర్‌లో ఓటేసిన మోదీ తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 14: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని ఆర్యభట్ హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. మరో కుమారుడు పంకజ్ మోదీ, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి 90 ఏళ్ల హీరాబెన్ ఓటు వేశారు. బూత్‌లో ఓటేసిన తరువాత బయటకు వచ్చి వేలుపై పెట్టిన సిరా గుర్తు ఆమె మీడియాకు చూపించారు. గుజరాత్ మాజీ సీఎం ఆనంద్‌బెన్ పటేల్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని ఘాత్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. గతంలో పటేల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడంలేదు. ఇప్పుడా నియోజకవర్గంలో బీజేపీ తరఫున భూపేందర్ పటేల్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా శశికాంత్ పటేల్ రంగంలో ఉన్నారు. పటీదార్ ఉద్యమ ప్రభావం బీజేపీపై ఎంతమాత్రం ఉండదని తమ పార్టీ అభ్యర్ధులందరూ ఘన విజయం సాధిస్తారని ఆనంద్ బెన్ ధీమా వ్యక్తం చేశారు.

చిత్రాలు....గుజరాత్‌లో గురువారం జరిగిన రెండో దశ ఎన్నికల పోలింగ్‌లో గాంధీనగర్ నియోజకవర్గంలో ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్. * అహ్మదాబాద్‌లో ఓటేసిన బీజేపీ నేత ఎల్.కే.అద్వానీ