జాతీయ వార్తలు

‘కోడ్’ ఉల్లంఘించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌కు ముందు రోజున ఓ పారిశ్రామిక సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ప్రధాన ప్రతిపక్షమైన తమపై మాటలతో దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ తన ఫిర్యాదులో పేర్కొంది. గుజరాత్‌లో టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చినందుకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అందుకు ప్రతిస్పందనగా మోదీ, అమిత్ షాలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 18లోగా సమాధానం ఇవ్వని పక్షంలో చర్య తీసుకుంటామని రాహుల్‌కు ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరి దశ పోలింగ్‌కు ముందు మీడియా సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయెల్ తదితరులు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచారని కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, ఆనంద్ శర్మ, రణ్‌దీప్ సుర్జేవాల నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం గురువారం ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును సమర్పించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.
ఎన్నికల ప్రచారం ముగిసిన మర్నాడు మోదీ ఓ సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో కొందరు పారిశ్రామికవేత్తలకు భారీగా రుణాలివ్వాలని బ్యాంకులపై ఒత్తిడి తెచ్చారని, యుపిఏ పాలనలో అదో పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యానించారు. పోలింగ్‌కు ముందు రోజున బుధవారం నాడు కూడా కాంగ్రెస్ హయాంలో కొంతమంది ‘ఆర్థికవేత్తల’ ప్రజాకర్షక పథకాల ఫలితంగా నిరర్థక ఆస్తులు, బ్యాంకులకు మొండి బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలను ప్రసారం చేసిన టీవీ చానళ్లపై ఎన్నికల సంఘం వ్యతిరేకంగా వ్యవహరించడం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఆరోపించారు. ‘ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఉండాలి.. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ విపక్ష నేతలకు నోటీసులు ఇవ్వడం సరికాదు..’ అని ఈసీకి సమర్పించిన ఫిర్యాదులో కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాహుల్ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన చానళ్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధలను ఉల్లంఘించిన మోదీ, అమిత్ షా, అరుణ్ జైట్లీ, పీయూష్ గోయెల్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జీతూ వఘానీ తదితర నేతలపైనా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.

చిత్రం..అహ్మదాబాద్‌లో ఓటేసిన బీజేపీ నేత అమిత్ షా