జాతీయ వార్తలు

కార్గిల్‌లో అతిశీతల రాత్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, డిసెంబర్ 16: లడఖ్ ప్రాంతంలోని కార్గిల్ పట్టణంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలితీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో ప్రస్తుత శీతాకాలంలో శుక్రవారం ‘అతిశీతల రాత్రి’గా నమోదైంది. కార్గిల్ సహా సమీప ప్రాంతాల్లో మైనస్ 11.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గత కొద్ది రోజులుగా కార్గిల్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఖ్వాజిగండ్, కోకెర్నాగ్, కుంప్వారా తదితర ప్రాంతాల్లో చలితీవ్రత అనూహ్యంగా పెరిగింది. ఉత్తర కాశ్మీర్‌లోని గుల్మార్గ్ రిసార్టుల వద్ద ఈ దశాబ్దకాలంలోనే అత్యల్పంగా మైనస్ పది డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాశ్మీర్‌లోయలో శరీరం గడ్డకట్టే స్థాయిలో శీతల వాతావరణం కొనసాగుతోంది. మరికొద్ది రోజులపాటు కాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.