జాతీయ వార్తలు

గేటు వద్ద తోపులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పట్ట్భాషేక కార్యక్రమానికి హాజరయ్యేందుకు శనివారం ఏఐసిసి కార్యాలయానికి వచ్చిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రులు, వర్కింగ్ కమిటీ సభ్యులు చుక్కలు చూడవలసి వచ్చింది. కార్యాలయం గేటు వద్ద జరిగిన తోపులాటలో ఎం.ఏ ఖాన్‌తో పాటు పలువురు నాయకుల సెల్ ఫోన్లు మాయమయ్యాయి. కొందరు సీనియర్ నాయకులు తొపులాటలో పక్కకు పడిపోతే, మరి కొందరు కాపాడే వారు లేక వెనక్కి వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యుడు ఎం.ఏ ఖాన్‌కు చెందిన రెండు ఆపిల్ ఐ ఫోన్లను ఏఐసిసి గేటు వద్ద జరిగిన తోపులాటలో కొట్టేశారు. హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తోపులాట మూలంగా రాహుల్ గాంధీ పట్ట్భాషేక కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆయన ఎంత ప్రయత్నించినా గేటు దాటలేకపోయారు. దీనితో విసిగిపోయిన చిదంబరం ఇంటిముఖం పట్టవలసి వచ్చింది. భద్రత పేరుతో ఏఐసిసి కార్యాలయం గేటు వద్ద పెద్ద ఎత్తున బైటివారిని నియమించటంతో సీనియర్ నాయకులను సైతం లోపలికి అనుమతించలేదు. తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు లోపలికి వెళ్లలేకపోయారు. పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీపిలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు రాహుల్ గాంధీ పట్ట్భాషేకానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ హయంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే ఆశాభావాన్ని పొన్నా ల వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ అగ్గిపట్టెలో పట్టే శాలువాను రాహుల్ గాంధీకి బహూకరించారు. ఇదిలా ఉంటే వి.హనుమంతరావు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు.