జాతీయ వార్తలు

కాంగ్రెస్ ఇక మారదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీలో అక్రమాలకు పరాకాష్ఠ అని భారతీయ జనతా పార్టీ విమర్శలు సంధించింది. అవినీతి, అక్రమాలే కాంగ్రెస్ విధానమని, ఆ పార్టీలో మార్పు వస్తుందని భావించడం పగటికలే అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. సోనియా నుంచి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ స్వీకరించాక ఆ పార్టీలో అనూహ్య పరిణామాలేవో సంభవిస్తాయని ఎవరూ ఆశించరాదని పాత్రా అన్నారు. బొగ్గు గనుల కుంభకోణం కేసులో కాంగ్రెస్ పార్టీ సమర్థించిన ఝార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు సిబిఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధించిందని, ఎంతోమంది కాంగ్రెస్ నేతలపై కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు.
గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా, యుపిఎ హయాంలో జరిగిన కుంభకోణాలు ఇపుడు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని పాత్రా అన్నారు. కాంగ్రె స్ నేతల తప్పుడు నిర్ణయాలు జాతిజనులను నేడు వెంటాడుతున్నాయని ఆరోపించారు. పార్టీలో నాయకత్వ మార్పు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, అయితే పదేళ్ల యుపిఏ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి వారు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేలైన ఆలోచనా విధానాలున్న పార్టీ కాదని, తప్పుడు విధానాలను అనుసరించి ఇపుడు కోర్టు కేసుల్లో ఇరుక్కున్న పార్టీ అని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేసిన విమర్శలు అర్థరహితమని పాత్రా తిప్పికొట్టారు. ‘కులమతాల పేరిట ప్రజల్లో చిచ్చుపెట్టి, మోదీ ఈ దేశాన్ని వెనక్కి నడుపుతున్నార’ని రాహుల్ వ్యాఖ్యానించారని, మోదీ విధానాలను ఆమోదిస్తున్నందునే ప్రతి ఎన్నికల్లో ప్రజలు తమకు పట్టం కడుతున్నారని అన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన మధుకోడాను సిఎంగా చేసి, కోట్లాది రూపాయల బొగ్గు కుంభకోణానికి కాంగ్రెస్ వ్యూహరచన చేసిందని ఆయన ఆరోపించారు.