జాతీయ వార్తలు

రాయ్‌బరేలీ బరిలో మళ్లీ సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నియోజకవర్గంలో తన తల్లి సోనియా గాంధీ మళ్లీ పోటీ చేస్తారని ప్రియాంక వాద్రా అన్నారు. రాజకీయాల నుంచి విశ్రాంతి కోరుకుంటున్న సోనియాకు బదులు తాను ఎంపీగా పోటీ చేయవచ్చనే ఊహాగానాలను ప్రియాంక కొట్టిపారేశారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ ఎంపీగా సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రాహుల్‌కు అండగా ఉండేందుకు ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, సోనియాకు బదులు రాయ్‌బరేలీలో పోటీ చేస్తారని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక తన అంతరంగాన్ని బయటపెట్టారు. కాగా, సోనియా పార్టీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నారని, రాజకీయాల నుంచి కాదని కాంగ్రెస్ నేతలు వివరణ ఇస్తున్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ స్వీకరించిన సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి ప్రియాంక వచ్చి, తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపారు. 19 ఏళ్ల పాటు పార్టీని నడిపించిన ధీర వనిత సోనియా అని ప్రియాంక పొగిడారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున సోనియా, రాహుల్ మాత్రమే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.