జాతీయ వార్తలు

రక్షణ రంగంలో దిగుమతులు తగ్గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: రక్షణ రంగంలో దిగుమతులు తగ్గాలని, స్వదేశీ పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ద్వారానే ఇది సాధ్యమని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విశాఖలోని ఎన్‌ఎస్‌టీఎల్‌లో శనివారం జరిగిన ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ టు ఇండస్ట్రీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భారత్ ఆయుధ సంపత్తి కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి ఇతర దేశాలకు రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాలు తయారు చేసుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) పరిశోధనలు కొనసాగాలన్నారు. రక్షణ రంగంలో ప్రతి రూపాయి ప్రజల సొమ్మని, ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండే మనం రక్షకులుగా మాత్రమే పనిచేయాలన్నారు. భారత్‌లో డీఆర్‌డీఓకు 52 పరిశోధన కేంద్రాలు ఉన్నాయని, ప్రతి పరిశోధన కేంద్రం నుంచి ఇన్నోవేటివ్ ఉత్పత్తులు రావాలని అభిలషించారు. త్వరలో ఢిల్లీలో జరగనున్న ఎక్స్‌పోలో డీఆర్‌డీఓ పరిశోధన కేంద్రాలు రెండేసి మోడల్స్‌తో స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌ఎస్‌టీఎల్ చైర్మన్ క్రిస్ట్ఫోర్ తదితరులు పాల్గొన్నారు.