జాతీయ వార్తలు

మైనర్లపై అత్యాచార కేసుల్లో 6నెలల్లో మరణశిక్ష అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే ఆరు నెలల్లో మరణశిక్ష అమలు చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన ‘నిర్భయ’ ఘటన జరిగి ఇప్పటికి ఐదేళ్లు పూర్తయినా దోషులకు ఇంతవరకూ శిక్షలు అమలు చేయలేదని విమర్శించారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులో ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా, వారిలో రామ్‌సింగ్ 2013 మార్చి నెలలో ఆత్యహత్యకు పాల్పడ్డాడు. మరొకతను మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష పూర్తి చేసుకుని విడుదలైపోయాడు. మరో నలుగురు అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేష్‌లకు ఢిల్లీ హైకోర్టు 2013 సెప్టెంబర్‌లో మరణశిక్ష విధించినప్పటికీ నేటికీ శిక్ష అమలు కాలేదు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మాలివాల్ అత్యాచార దోషులకు తగిన శిక్షలు అమలుకానందునే దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు తీవ్రమవుతున్నాయని అన్నారు. కనీసం మైనర్ల విషయంలోనైనా వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆరు నెలలో దోషులకు మరణశిక్ష అమలు చేయాలని మోదీకి రాసిన లేఖలో విన్నవించారు. అలాగే ఢిల్లీలో మహిళల రక్షణకు ఒక హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రిని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను, ముఖ్యమంత్రిని, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను సభ్యులుగా చేర్చాలని మాలివాల్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మంకా ప్రవేశపెట్టిన పథకం ‘్భటీ పడావో, భేటీ బచావో’కు తగిన నిధులు విడుదల చేసి, పథకం లక్ష్యం నీరుగారిపోకుండా చూడాలని ప్రధానిని కోరారు.