జాతీయ వార్తలు

అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరునల్‌వేలి, మార్చి 26: ఎన్నికలు వచ్చినప్పుడల్లా ‘తాయిలాలు’ చూపించి ఓట్లు దండుకోవడం డిఎంకె, ఎఐడిఎంకె పార్టీలకు అలవాటుగా మారిందని డిఎండికె-పిడబ్ల్యుఎఫ్ కూటమి నేత విజయకాంత్ భార్య ప్రేమలత విమర్శించారు. గత యాభైఏళ్లుగా ఈ రెండు ప్రధాన పార్టీలు తమిళనాడు ఓటర్లను ఇదే విధంగా మోసగించాయని, ప్రస్తుతం మరో ప్రత్యామ్నాయం వైపు వారు ఎదురు చూస్తున్నారని అన్నారు.
తిరునల్‌వేలిలోని నెల్లాయప్పర్ దేవాలయాన్ని ప్రేమలత శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తమ కూటమి తాయిలాలు ఏమీ ప్రకటించదని, ప్రజలు, రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా తమ మేనిఫెస్టో ఉంటుందని వివరించారు. ప్రముఖ సినీనటుడు విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె ఇటీవలే పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్‌తో కలిసి కూటమిగా ఏర్పడడం, ఈ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కాంత్‌ను ప్రకటించడం తెలిసిందే.