జాతీయ వార్తలు

సమన్యాయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: తెలుగు రాష్ట్రాలు రెండూ విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని, కృష్ణా జలాల పంపకాలు కేటాయింపుల ప్రకారం సాగాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. ఈమేరకు బోర్డు అధికారులకు టెలిఫోన్‌లో ఆదేశాలిస్తూ, తెలంగాణ, ఆంధ్రకు దేనికీ నష్టం వాటిల్లకుండా వ్యవహరించాలని సూచించారు. ఒక రాష్ట్రం పట్ల పక్షపాతంతో వ్యవహరించటం ఎంతమాత్రం మంచిదికాదని బోర్డు అధికారులకు ఉమాభారతి స్పష్టం చేశారు. నదీ జలాల పంపకాల్లో అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ సాగునీటి మంత్రి హరీశ్ నేతృత్వంలో తనను కలిసిన బృందం వాదన విన్న ఉమాభారతి, మంగళవారం కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు అధికారులతో సమావేశం కావాలని తెలంగాణ సిఎస్ రాజీవ్ శర్మకు సూచించారు. కృష్ణా యాజమాన్య బోర్డు వైఖరిపై అమీతుమీ తేల్చుకోవడానికి మంత్రి హరీశ్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన బృందం, సోమవారం కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమైంది. కృష్ణా యాజమాన్య బోర్డు ఇటీవల జారీ చేసిన ముసాయిదాను ఆమోదించవద్దని కోరింది. ఆంధ్రలోని పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రావటం, పట్టిసీమ ప్రాజెక్టు పూరె్తైనందున జిడబ్ల్యుడిటి (గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్), కెడబ్ల్యుడిటి (కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్) అవార్డుల ప్రకారం తెలంగాణకు అదనంగా 90 టిఎంసి జలాలు కేటాయించాలంటూ కేంద్ర మంత్రి వద్ద హరీశ్‌రావు కొత్త వాదనకు తెరతీశారు. తెలంగాణకు అదనంగా 90 టిఎంసి కేటాయించాలని మంత్రిని కోరినట్టు హరీశ్ వెల్లడించారు. రెండు రాష్ట్రాలకు నీటి పంపిణీని ఖరారు చేస్తూ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్రం ఆమోదించే పక్షంలో వ్యవహారాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని ఉమాభారతికి స్పష్టం చేశామన్నారు. సిఎస్ రాజీవ్ శర్మ, నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఎంపీలు బాల్క సుమన్, బూర నరసయ్యగౌడ్, బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారిలతో కూడిన హరీశ్‌రావు బృందం సోమవారం ఉమాభారతితో సమావేశమయ్యారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ బోర్డు కార్యదర్శి గుప్త నోటిఫికేషన్ జారీ చేయటం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది విభజన చట్టానికి పూర్తిగా వ్యతిరేకమని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్న గుప్తాను తక్షణం తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హరీశ్‌రావు వాదనను సావధానంగా విన్న ఉమాభారతి వెంటనే బోర్డు అధికారులకు టెలిఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ నీటి యాజమాన్య నిర్వహణాధికారం మాత్రమేవున్న బోర్డుకు జల వాటాలు నిర్ణయించే అధికారం లేదన్నారు. అయితే, ఆంధ్ర రాసిచ్చిన లేఖపై బోర్డు కార్యదర్శి ఆర్‌కె గుప్తా సంతకం చేసినట్టు ఉందని ఆరోపించారు. బోర్డు కేటాయింపులను కేంద్రం ఆమోదించినా కోర్టులో చెల్లదన్నారు. ఆంధ్ర వాటాలోని చుక్క నీటిని కూడా తెలంగాణ వాడుకునేది లేదని కేంద్ర మంత్రికి స్పష్టం చేశామంటూనే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతున్న సమయంలో నీటి పంపిణీని బోర్డు ఎలా నిర్ణయిస్తుందని ప్రశ్నించారు. లేని బాధ్యతలను బోర్డు చేపట్టడం చట్ట విరుద్ధమేనని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువనున్న తెలంగాణ ప్రాజెక్టు జూరాలను తన పరిధిలోకి తీసుకున్న బోర్డు, ఆంధ్రలోని పులిచింతల, కృష్ణా డెల్టా, కెసి కెనాల్‌పై నామమాత్రపు నియంత్రణను నోటిఫికేషన్‌లో పొందుపర్చడం ఏమేరకు న్యాయమని ప్రశ్నించారు. తెలంగాణ మిగుల జలాలపై ఆధారపడిన కల్వకుర్తి, ఎఎంఆర్‌పి ప్రాజెక్టులు వరద జలాలు వాడుకోవాలని నోటిఫికేషన్‌లో పొందుపర్చి, ఆంధ్రలో కృష్ణా డెల్టాకు బయట, పెన్నా బేసిన్ లోపలున్న వెలుగొండ, పోతిరెడ్డిపాడు, గాలేరు-నగిరి, ఎస్‌ఎన్‌బిఎస్ ప్రాజెక్టుల విషయంలో వరద జలాలు అనే పదం జోడించలేదని హరీశ్‌రావు గుర్తు చేశారు. బోర్డు పక్షపాత వైఖరికి ఇంతకంటే నిదర్శనమేంటని ప్రశ్నించారు. కెసి కెనాల్‌కు కేటాయింపులు 31 టిఎంసి వుంటే, ఏటా వాడుకుంటున్న జలాలు 55 టిఎంసి అన్నారు. అలాగే కృష్ణా డెల్టా కేటాయింపులు 152 టిఎంసి అయితే, ఏటా 230 టిఎంసి తక్కువ కాకుండా వాడుకుంటున్నారని, వీటిపై నియంత్రం పెట్టలేదెందుకని ప్రశ్నించారు. ఈ అపసవ్యతలను కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి తెచ్చినపుడు, కేంద్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి అమర్‌జీత్ సింగ్‌కు వివరించాలని తమకు సూచించారన్నారు. మంగళవారం ఈ విషయాలన్నీ నీటిపారుదల శాఖ కార్యదర్శికి వివరిస్తామన్నారు. కేబినెట్ సెక్రటేరియట్‌లోని సమన్వయ కార్యదర్శి శ్రీవాస్తవకూ ఉన్న పరిస్థితిని వివరించినట్టు హరీశ్ రావు వెల్లడించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేంత వరకూ యథాతథ స్థితి కొనసాగాలనే అవగాహానకు రెండు రాష్ట్రాలూ వచ్చాయన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పని త్వరగా ముగించి నీటి కేటాయింపులు చేపట్టేలా ఆదేశించాలని మంత్రిని కోరామన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉండాలని తెలంగాణ సైతం కోరుకుంటోందని, అయితే అది తమ పరిధిలో పనిచేయాలన్నది తెలంగాణ వాదన అన్నారు.
గోదావరి అవార్డు ప్రకారం ఏరోజైతే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు లభించాయో, ఆరోజు నుంచి లెక్కల ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన 45 టిఎంసి కేటాయించాలని ఉమాభారతిని కోరామన్నారు. అయితే, ఈ 45 టిఎంసిని కృష్ణా నుండి కేటాయించాలని కోరినట్టు చెప్పారు. కృష్ణా అవార్డు ప్రకారం గోదావరి నుండి పోలవరం ప్రాజెక్టు కాకుండా ఇతర ప్రాజెక్టులకు అదనపు నీటిని మళ్లిస్తే ఎగువ రాష్ట్రాలకు దానిలో వాటా ఇవ్వాలన్న నిబంధన ప్రకారం,
ఉంది కనుక 80 టిఎంసి జలాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు వాటాలు కేటాయించాలన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మరో 45 టిఎంసి తెలంగాణాకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అంటే తెలంగాణకు మొత్తం 90 టిఎంసి జలాలను అదనంగా కేటాయించాలని ఉమాభారతిని కోరినట్టు చెప్పారు. పట్టిసీమ పోలవరంలో భాగంకాదన్న విషయాన్ని ఏపీ సిఎం చంద్రబాబే చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా నిధులు కేటాయించాలని మంత్రిని కోరామన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న విషయాన్నీ కేంద్ర మంత్రి ఉమాభారతికి గుర్తు చేసినట్టు హరీశ్ చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని చూసేందుకు తెలంగాణకు రావాల్సిందిగా ఉమాభారతికి ఆహ్వానించినట్టు హరీశ్‌రావు చెప్పారు.

చిత్రం కృష్ణా బోర్డు వ్యవహారంపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పిస్తున్న టి.బృందం