జాతీయ వార్తలు

నిరాశ్రయులకు గ్రంథాలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: నిలువ నీడలేని పేదలకు ధార్మిక సంస్థలు పట్టెడన్నం పెట్టడం, బట్టలివ్వడం, ఆశ్రయం కల్పించడం చూస్తుంటాం. కాని, ఢిల్లీలోని మానవతా దృక్పథం కలిగిన ఒక స్వచ్ఛంద సంస్థ ఓ అడుగు ముందుకేసి అలాంటి అభాగ్యులకు పుస్తక పఠనానికి అవకాశం కల్పించడం ద్వారా వారిలో విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించడానికి నడుం కట్టింది. ఢిల్లీలోని అత్యంత పెద్ద మురికివాడల్లో ఒకటయిన యమున పుష్ట వద్ద ఇప్పుడు ఇళ్లు లేని పేదల కోసం ఒక ఉచిత గ్రంథాలయం వెలసింది. అధ్యయన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రయస్ జాక్ సొసైటి అనే మరో స్వచ్ఛంద సంస్థతో కలిసి ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (డియుఎస్‌ఐబి) సహకారంతో ఈ ఉచిత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ గ్రంథాలయంలో దినపత్రికలు, మ్యాగజైన్లతో పాటు కాల్పనిక సాహిత్యం మొదలుకొని వివిధ ప్రపంచ నేతల ఆత్మకథల వరకు అన్ని రకాల సాహిత్యం అందుబాటులో ఉంది. ఏ సమాజ అభివృద్ధిలోనయినా పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని ఇటీవల ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆల్కా లంబా అన్నారు.