జాతీయ వార్తలు

ఓటుకు నోటిస్తే ఎన్నిక రద్దు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ధనబలాన్ని ఉపయోగించడం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ‘ఓటుకు నోటు’ ఆధారంగా ఎన్నికలను రద్దు చేసేందుకు వీలు కల్పిస్తూ ఎన్నికల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ఓట్లు రాబట్టేందుకు ధనబలాన్ని ఉపయోగిస్తే ఆ ఎన్నికను వాయిదా వేయడానికి లేదా రద్దు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘానికి అధికారం ఉంది. అయితే ధనబల వినియోగం కారణంగా ఎన్నికను రద్దు చేయడానికి వీలు కల్పిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరాలని అనుకుంటోంది.
ఎన్నికల్లో కండబలాన్ని వినియోగించినా, పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకున్నా సదరు నియోజకవర్గంలో ఎన్నికను రద్దుచేసే అధికారాన్ని మాత్రమే ఎన్నికల సంఘానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం కల్పిస్తోంది. ఈ నిబంధనలో ధనబలాన్ని కూడా చేరిస్తే బావుంటుందని ఎన్నికల సంఘం అధికారులు సోమవారం ఇక్కడ పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని కోరుతూ ఎన్నికల సంఘం రానున్న రోజుల్లో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాసే అవకాశం ఉంది. ఓటర్లను ఆకర్షించడానికి పెద్దఎత్తున ధనాన్ని వినియోగించారనే కారణంతో తమిళనాడులోని అరవకురిచి, తంజావూరు అసెంబ్లీ నియోజవర్గాలలో ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ఎన్నికల సంఘం మే 27న ఆ రాష్ట్ర గవర్నర్‌కు సిఫారసు చేసిన విషయం తెలిసిందే.