జాతీయ వార్తలు

ఎన్‌ఐఏకు అప్పుడే చెప్పాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 26: ఇషత్ జహాన్ ఆపరేషన్ గురించి పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహమాన్ లఖ్వీ తనకు చెప్పాడని పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబయి ఉగ్రవాద దాడి కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు శనివారం చెప్పాడు. జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) తన స్టేట్‌మెంట్‌లో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదో అర్థం కావడం లేదని ఆయన అన్నాడు. భారత్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన లష్కరే తోయిబా మహిళా టెర్రరిస్టు ఇషత్ జహాన్ అని తాను ఎన్‌ఐఏకి చెప్పానని, అయితే ఎన్‌ఐఏ ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదో తనకు తెలియదని ముంబయి ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన నిందితుడు అబూ జుందాల్ తరఫున డిఫెన్స్ న్యాయవాది వాహబ్ ఖాన్ జరిపిన క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా హెడ్లీ చెప్పాడు.
కాగా, శివసేన అధినేత బాలాసాహెబ్ థాకరేకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని లష్కరే తోయిబా చీఫ్, 26/11 దాడుల ప్రధాన కుట్రదారయిన హఫీజ్ సరుూద్ ముంబయి దాడులకు ముందు తనతో అన్నట్లు హెడ్లీ చెప్పాడు. ఆ పని చేయవచ్చని, దాన్ని పూర్తి చేయడానికి ఆరునెలల సమయం చాలని తాను సరుూద్‌కు చెప్పినట్లు కూడా అతను చెప్పాడు. ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారి అమెరికాలో 35 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న హెడ్లీని వీడియో లింక్ ద్వారా నాలుగు రోజులుగా జరుపుతున్న క్రాస్ ఎగ్జామినేషన్ శనివారం ముగిసింది. భారత్‌లో నిర్వహించిన రెక్కీలో భాగంగా భారత ఉపరాష్టప్రతి నివాస భవనాన్ని వీడియో తీశావా అని అడగ్గా, భవనం బయటి ప్రహరీ గోడలను మాత్రమే వీడియో తీశానని, అది కూడా ఢిల్లీలోని సేనాభవన్‌నుంచి నేషనల్ డిఫెన్స్ కాలేజికి వెళ్తూ తీసినట్లు హెడ్లీ తెలిపాడు.
హెడ్లీ తదుపరి క్రాస్ ఎగ్జామినేషన్‌కు సంబంధించి ముంబయి సెంట్రల్ జైల్లో ఉన్న అబూ జుందాల్‌నుంచి ఆదేశాలు తీసుకోవలసి ఉన్నందున క్రాస్ ఎగ్జామినేషన్‌ను వాయిదా వేయాలన్న డిఫెన్స్ న్యాయవాది అభ్యర్థనను అంతకు ముందు న్యాయమూర్తి జిఏ సనప్ తిరస్కరించారు. ఈ కారణంపై హెడ్లీ వాంగ్మూలాన్ని వాయిదా వేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత జడ్జి జైల్లో జుందాల్‌ను లాయరు రెండు గంటలపాటు కలుసుకోవడానికి లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతనితో మాట్లాడడానికి అనుమతించాలని జైలు అధికారులను ఆదేశించారు. అయితే డిఫెన్స్ లాయరు దీనికి అంగీకరించకపోవడంతో జడ్జి ఆయన అభ్యర్థనను తోసిపుచ్చారు. అనంతరం హెడ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయినట్లు ప్రకటించారు. దాడులకు అనువైన స్థలాలను సర్వే చేయడంలో భాగంగా తాను ముంబయిలోని భాభా అణు పరిశోధనా కేంద్రాన్ని (బార్క్) సందర్శించినట్లు రీ ఎగ్జామినేషన్ సందర్భంగా హెడ్లీ చెప్పాడు. పాకిస్తాన్‌కు చెందిన మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు తాను బార్క్ సందర్శించానని చెప్పాడు.

కాగా, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను అంతం చేయాలని లష్కరే తోయిబా అనుకున్నట్లు చెప్పడం సరికాదని అంతకుముందు హెడ్లీ డిఫెన్స్ లాయరుకు చెప్పాడు.