జాతీయ వార్తలు

మనది బలమైన చెలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: లెసతో అభివృద్ధి సాధనకు భారత్ అన్ని విధాలా సహకారం అందించడానికి కట్టుబడి ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎన్నికైన దల్వీర్ భండారీ సహా బహుపాక్షిక కార్యవర్గాల ఏర్పాటు విషయంలో భారత్‌కు లెసతో అందిస్తున్న సహకారం మర్చిపోలేనిదన్నారు. ఈమేరకు రాష్టప్రతి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. భారత పర్యటనకు వచ్చిన లెసతో రాజు లెట్సీ -3, ఆయన భార్య, రాణి మసెనటె మెహతో సీసో మంగళవారం రాష్టప్రతి కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ భారత్- లెసతో మధ్య హృదయపూర్వక బాంధవ్యం ఉందని గుర్తు చేశారు. ఆ దేశంతో ప్రగతి భాగస్వామిగా ఉండేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. భారత్ తరఫున లెసెతోలో ఐటీ కేంద్రం నెలకొల్పి, అక్కడి యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు.
బహుపాక్షిక కార్యవర్గాల్లో భారత్ సభ్యత్వాలకు లెసతో అందిస్తున్న మద్దతు మరువలేనిదన్నారు. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ (ఐటిఎల్‌ఓఎస్)లో నీరు చద్దాకు స్థానం దక్కడం, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన దల్వీర్ భండారీకి అవకాశం దక్కిన సందర్భంలో లెసతో సహకారం ఎప్పటికీ మర్చిపోయేది లేదని రాష్టప్రతి కోవింద్ గుర్తు చేసుకున్నారు.

చిత్రం..భారత పర్యటనకు వచ్చిన లెసతో రాజదంపతులు మంగళవారం రాష్టప్రతి కోవింద్‌ను కలుసుకున్నప్పటి చిత్రం