జాతీయ వార్తలు

పార్లమెంట్‌ను కుదిపేసిన మహారాష్ట్ర అల్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ డిమాండ్
ఓటమిని జీర్ణించుకోలేకే ఆరోపణలు: బీజేపీ
రాజ్యసభలో చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు
సభా కార్యక్రమాలకు అంతరాయం.. వాయిదాలు

న్యూఢిల్లీ, జనవరి 3: మహారాష్టల్రో భీమా కొరేగావ్ పోరాటానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించన కార్యక్రమాల్లో చేలరేగిన దాడుల అంశం బుధవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. మహారాష్టల్రో చెలరేగిన అల్లర్లను అదుపుచేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని, దీనిపై ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో రాజ్యసభ వరసగా మూడుసార్లు, లోక్‌సభ ఒకసారి వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభమైన తరువాత వివిధ మంత్రిత్వ శాఖలు, కమిటీలకు సంబంధించిన పత్రాలు సమర్పించిన అనంతరం చైర్మన్ వెంకయ్య నాయుడు జీరో అవర్‌ను కొనసాగించేందుకు ప్రయత్నించారు. విపక్ష ఎంపీలు మహారాష్టల్రో జరిగిన అర్లర్లపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో చైర్మన్ 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడం, విపక్ష సభ్యులు తమ స్థానాల్లో నిలబడి ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో రెండు గంటలకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ ప్రారంభం కాగానే బీఎస్పీ సభ్యుడు సతీష్‌చంద్ర మిశ్రా మహారాష్టల్రో జరిగిన పరిణామాలపై చర్చకు నోటీసు ఇచ్చానని, చర్చను వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం, దళితులపై దాడులు జరుగుతున్నాయని, దీనిపై చర్చ చేపట్టాలని, కేంద్రం సమాధానం చెప్పాలని సతీష్ మిశ్రా డిపూటీ చైర్మన్ కురియన్‌ను కోరారు. సభను కొనసాగించేందుకు సహకరించాలని కురియన్ సభ్యులను కోరారు. విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు రావడంతో సభను మూడు గంటలకు వాయిదా వేశారు.
లోక్‌సభలో పాలక, విపక్షాల వాగ్వాదం
మహారాష్టల్రో జరిగిన దాడులు వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని, సమాజంలోని కులాల మధ్య ఆ సంస్థ చిచ్చుపెడుతోందని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ఆరోపించింది. దేశవ్యాప్తంగా దళితులపై బిజేపీ-ఆరెస్సెస్‌లు విద్వేషాన్ని రగిలిస్తున్నాయని, ఈ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మహారాష్టల్రోని భీమా-కోరెగావ్‌లో దళితులపై దాడులకు సంబంధించి మోదీ తన వైఖరిని స్పష్టం చేయాలని, సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జిచేత న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. పూణె జిల్లాలో భీమా-కొరేగావ్ యుద్ధం 200 వార్షికోత్సవం సందర్భంగా దళితులు, హిందూ సంస్థల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మరణించారని, ప్రజలను విభజించి చూసే బీజేపీ-ఆరెస్సెస్‌లే ఈ ఘటనకు కారణమని ఆయన ఆరోపించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో దళితులు, ముస్లిలపై దాడులు జరుగుతున్నాయని ఖర్గే మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రధాని ఇతర పార్టీవాళ్లను ‘వౌనిబాబా’లని అంటారు. కాని ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీయే ‘వౌనిబాబా’ అని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఆగ్రహించిన ఖర్గే తన చేతిలోని పత్రాలను చించివేశారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ మాట్లాడుతూ మహారాష్టల్రో జరుగుతున్న అల్లర్లకు పరిష్కారం చూపకుండా ఖర్గే రెచ్చకొట్టాలని భావిస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని, దేశంలో అన్నిచోట్లా అపజయం పాలైందని, అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఈ పరిస్థితులలో అక్కడ శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘విభజించు-పాలించు’ అనే విధానాన్ని అవలంబిస్తోందని అనంత్ కుమార్ ధ్వజమెత్తారు.