జాతీయ వార్తలు

రన్‌వే నుంచి జారిపడ్డ ఎంఐజీ యుద్ధ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జనవరి 3: గోవాలోని ఐఎన్‌ఎస్ హన్స నేవల్ బేస్‌లో బుధవారం మధ్యాహ్నం ఎంఐజీ 29కే యుద్ధ విమానం పైకి లేచే సమయంలో రన్‌వే నుంచి జారిపడింది. అయితే, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి ఈ యుద్ధ విమానాన్ని సురక్షితంగా యథాస్థానానికి చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారత నావికాదళంలో కొత్తగా చేరిన ఎంఐజీ 29కే యుద్ధ విమానానికి ఈ తరహా ఘటన ఎదురుకావడం ఇదే ప్రథమం. యుద్ధ విమానం ‘టేకాఫ్’ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్య కారణంగా జరిగిన ఈ ఘటనపై విచారణ జరుపుతామని గోవా ప్రాంత ఫ్లాగ్ కమాండింగ్ ఆఫీసర్ రియల్ అడ్మిరల్ పునీత్ కే బాహ్ల్ తెలిపారు. ‘టేకాఫ్’ సమయంలో సమస్య ఏర్పడగా అదే దిశగా పైలట్ ప్రయత్నించడంతో యుద్ధ విమానం రన్‌వే నుంచి పక్కకు వచ్చినట్లు ఆయన వివరించారు. రన్‌వే చివరి భాగాన 150 మీటర్ల ముందు విమానం నిలిచిపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. గోవాలో ప్రయాణీకుల విమానాలు సైతం రాకపోకలు కొనసాగించే డబొలిమ్ విమానాశ్రయంలో ఉత్తర భాగాన ఉన్న ఐఎన్‌ఎస్ హన్స నేవల్ ఎయిర్ బేస్‌లో ఈ ఘటన జరిగిందన్నారు.
ఓ ప్రయాణీకుల విమానం ఎయర్‌పోర్టులో దిగడానికి 10 నిమిషాల ముందు యుద్ధ విమానం రన్‌వే పై నుంచి తప్పుకుందని గోవా ఎయిర్‌పోర్టు డైరెక్టర్ బిసిహెచ్ నెగి తెలిపారు. మధ్యాహ్నం 12.30 నుంచి రన్‌వేపై రాకపోకలను నిలిపివేసి 1-40 గంటల తర్వాత యథావిధిగా విమానాలను అనుమతించారు. ‘సీ హారియర్స్’ సేవలను ఉపసంహరించాక, రష్యా నుంచి దిగుమతైన ఎంఐజీ 29కే యుద్ధ విమానాలను నావికాదళంలో చేర్చారు. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలను ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నౌక నుంచి రక్షణ అవసరాలకు నౌకాదళం వినియోగిస్తోంది.