జాతీయ వార్తలు

తెగని ట్రిపుల్ తలాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవరణలైనా చేయాలని పట్టబట్టిన ఆజాద్ ఓటింగ్ పెట్టాలని తృణమూల్ సభ్యుడి సూచన
అధికార విపక్షాల రభసతో రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ, జనవరి 3: ముస్లిం మహిళలకు ‘త్రిపుల్ తలాక్’ నుండి విముక్తి కలిగించేందుకు ఉద్దేశించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలా, వద్దా? అనే అంశంపై అధికార, ప్రతిపక్షాలు బుధవారం రాజ్యసభలో హోరాహోరీకి దిగాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పెద్దఎత్తున గొడవ చేయటంతో రాజ్యసభ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రేపటికి వాయిదా పడింది. బిల్లుపై వెంటనే చర్చ జరిపి ఆమోదించాలని అధికార పక్షం డిమాండ్ చేయగా ప్రతిపక్షం మాత్రం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించవలసిందేనని పట్టుపట్టటంతో రాజ్యసన దద్దరిల్లిపోయింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును బుధవారం సాయంత్రం రాజ్యసభలో ప్రతిపాదించారు. ఈ బిల్లుపై చర్చ జరిపి ఆమోదించాలని ఆయన విజప్తి చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుఖేందురాయ్, కాంగ్రెస్ ప్రతిపక్షం ఉపనాయకుడు ఆనంద్ శర్మ దీనిని వ్యతిరేకించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ ఆనంద్ శర్మ ఒక తీర్మానాన్ని సభలో ప్రతిపాదించటంతో పాటు ప్రతిపక్షం తరపున కమిటీలో ఉండవలసిన సభ్యుల పేర్లను కూడా ప్రతిపాదించారు. ప్రభుత్వం తమ సభ్యుల పేర్లను కూడా దీనికి జోడించాలని ఆయన సూచించారు. సభానాయకుడు, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దీనిని గట్టిగా వ్యతిరేకించారు. ఆనంద్ శర్మ ప్రతిపాదించిన తీర్మానం రాజ్యసభ నియమాళికి విరుద్ధమని ఆయన గట్టిగా వాదించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చకుండా చూసేందుకే కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం తెలిపి, రాజ్యసభలో వ్యతిరేకించటం వెనక కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటిని అరుణ్ జైట్లీ నిలదీశారు. సుప్రీం కోర్టు ట్రిపుల్ తలాక్‌ను ఆరు నెలలపాటు రద్దుచేసి ఈలోగా దీనికి సంబంధించిన చట్టాన్ని చేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకే తామీ చట్టాన్ని చేస్తున్నాం, అయితే కాంగ్రెస్ కోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడు సుప్రీం కోర్టు నిషేధించిన తరువాత కూడా ట్రిపుల్ తలాక్ ఇచ్చి ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్నారని కొన్ని సంఘటనలను ఉదహరించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయెల్ లేచి ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనుకుంటున్న కాంగ్రెస్ ఈ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ అరుణ్ జైట్లీ ఆరోపణలను ఖండించారు. బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నాం, అయితే కొన్ని సవరణలు చేయాలన్నది తమ డిమాండ్, దీనికి ప్రభుత్వం ఒప్పుకోవచ్చుకదా అని నిలదీశారు. బిల్లుపై లోతుగా చర్చ జరిపేందుకు దీనిని సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్‌పై ఆరు నెలల్లోగా చట్టం చేయాలంటూ సుప్రీం కోర్టు ఎలాంటి గడువు విధించలేదు, అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ పక్షం నాయకుడు డెరిక్ ఓబ్రేన్ లేచి ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలా, వద్దా? అనే అంశంపై సభలో ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు సంబంధించిన తీర్మానాన్ని 24 గంటల ముందు ప్రతిపాదించవలసి ఉంటుందని సూచించారు. దీనికి డిప్యూటీ చైర్మన్ కురియన్ బదులిస్తూ సభాధ్యక్షుడు ఈ నియమానికి మినహాయింపు ఇచ్చాడని సూచించాడు. సభలోని మెజారిటీ సభ్యులు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవటం లేదని గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మెజారటీ సభ్యుల అభిప్రాయం చెల్లుతుందనేది అందరికీ తెలిసిందే, లోక్‌సభలో ఎన్‌డిఏకు మెజారిటీ ఉన్నది కాబట్టి బిల్లును ఆమోదించి పంపించారు, రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్నది కాబట్టి సెలెక్ట్ కమిటీకి పంపించాలంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సభలో మొదట ప్రతిపాదించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే అధికారం మాత్రమే రాజ్యసభకు ఉన్నది, లోక్‌సభ ఆమోదించి పంపించిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే అధికారం రాజ్యసభకు లేదని అరుణ్ జైట్లీ వాదించారు. ముస్లిం మహిళల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించగా, ఆనంద్ శర్మ లేచి మహిళల ప్రయోజనాల పట్ల అంతగా ప్రేమ ఉంటే చట్టసభల్లో మహిళలకు యాభై శాతం సీట్లు రిజర్వు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సభలో ప్రతిపాదించాలి, మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఈ దశలో కొందరు మంత్రులతోపాటు పలువురు సభ్యులు తమ సీట్లలో నిలబడి బిల్లుపై వెంటనే చర్చ జరిపి ఆమోదించాలంటూ నినాదాలిచ్చారు. దీనికి ప్రతిగా ప్రతిపక్షం సభ్యులు తమ సీట్లలో నిలబడి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందేనంటూ నినాదాలు ఇవ్వటంతో రాజ్యసభ దద్దరిల్లిపోయింది. సభను అదుపు చేసేందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంత ప్రయత్నించినా సభ్యులు శాంతించలేదు. దీనితో కురియన్ రాజ్యసభను గురువారానికి వాయిదా వేశారు.