జాతీయ వార్తలు

రాష్టప్రతి పాలన విధించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించాలని భారతీయ జనతా పార్టీ శనివారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 28న జరగనున్న బలపరీక్షలో తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు పొందడం కోసం ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వారితో బేరసారాలు జరుపుతున్నట్లు ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బైటపడిన తర్వాత రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కోల్పోయారని, అందువల్ల రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించాలని బిజెపి ప్రతినిధి బృందం ఒకటి శనివారం రాష్టప్రతిని కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర గవర్నర్ కెకె పౌల్ తీరును కూడా ఆ వినతిపత్రంలో విమర్శించిన బిజెపి రావత్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్న మెజారిటీ సభ్యుల అభ్యర్థనను పట్టించుకోకపోగా బల నిరూపణకు రావత్‌కు పది రోజుల గడువు ఇచ్చారని దుయ్యబట్టింది.