అంతర్జాతీయం

సార్క్ దేశాల మధ్య బంధం బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: దక్షిణాసియా విశ్వవిద్యాలయం సొంత క్యాంపస్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరించడానికి భారత్ ముందుకొచ్చింది. సార్క్ విద్యాసంస్థ తొలి స్నాతకోత్సవం శనివారం ఇక్కడ జరిగింది. సార్క్‌దేశాల మధ్య మైత్రి, సహకారం మరింత బలోపేతం అయ్యేందుకు భారత్ చొరవతీసుకుంటుందని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్ స్పష్టం చేశారు. నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తున్న వర్శిటీకి పూర్తిస్థాయి హంగులతో కూడిన క్యాంపస్‌కు మొత్తం నిధులను సమకూర్చుతామని సింగ్ ప్రకటించారు. సార్క్‌దేశాల మధ్య శాంతి, సహకారం కొనసాగాలని నేపాల్ ఉప ప్రధాని ఆకాంక్షించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు రేపటి దక్షిణాసియా నాయకులని ఆయన అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు స్నేహపూర్వకంగా ఉంటూ సార్క్ స్ఫూర్తిని ఇనుమడింప చేయాలని వికె సింగ్ పిలుపునిచ్చారు. ‘వర్శిటీ అభివృద్ధికి మేం పాటుపడతాం. క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి 100 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయిస్తుంది. ఖర్చు మొత్తం మేమే భరించి అత్యాధునిక క్యాంపస్ నిర్మిస్తాం’ అని విదేశాంగ మంత్రి హామీ ఇచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన నేపాల్ ఉప ప్రధాని పరస్పర సహకారంతో ప్రాంతీయ అభివృద్ధి సాధించాలన్నారు. సార్క్ దేశాల మైత్రికి భారత్ చేస్తున్న కృషిని ఆయన గుర్తుచేశారు. 2010లో దక్షిణాసియా వర్శిటీ ఇక్కడ నడుస్తోంది. శనివారం నాటి స్నానకోత్సవంలో 652 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. ఇద్దరికి ఎంఫిల్ ఇచ్చారు.

చిత్రం ఢిల్లీలో శనివారం జరిగిన సార్క్ విద్యా సంస్థ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వికె సింగ్