జాతీయ వార్తలు

హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: కోడి పందేల నిర్వహణపై అంక్షలు విదిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టు కోడి పందేలపై 2016లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిదేనని, ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆదేశాలు జారీ
చేసింది తెలిపింది. కోడి పందేల జరగకుండా ఏ చర్యలు తీసుకున్నరో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఈ నెల 4న ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తు బీజేపీ నేత రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం మధ్యాహ్నం సుప్రీం కోర్టులోని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవలేమని ధర్మాసనం పేర్కొంది. కోళ్లను అదుపులోకి తీసుకోకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని పిటిషనర్ తరఫున్యాయవాది బెంచ్‌ను కోరారు. దీనిపై హైకోర్టును సంప్రదించాలని ధర్మాసనం సూచించింది.