జాతీయ వార్తలు

కొత్త ఆలోచనలతో ముందుకు సాగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశ యువత కొత్త ఆలోచనలతో ముందుకుసాగి ఉపాధి అవకాశాల సృజనలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇందుకు అవసరమైన తోడ్పాటును అన్ని విధాలుగా అందించడంతోపాటు స్టార్టప్‌లు ఏర్పాటు చేయడంతో యువతను ప్రభుత్వం చేయిపట్టుకుని ముందుకు నడుపుతుందని ప్రధాని అన్నారు. సరికొత్త ఆలోచనలతో దేశ యువత ఇటు దేశానికి అటు సమాజానికి ప్రయోజనం కలిగించే రీతిలో తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆయన తెలిపారు. 22వ జాతీయ యువజనోత్సవాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో గౌతమబుద్ధా వర్శిటీ విద్యార్థులను పురస్కరించుకుని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. తొలి అడుగు బలంగా వేస్తే ఎలాంటి విజయాన్నైనా సాకారం చేసుకునే అవకాశం ఉంటుందన్న మోదీ తాను అనుకున్న పథంలో వ్యక్తులు ముందుకు వెళితే ఇతరులూ వారిని అనుసరిస్తారని అన్నారు.‘ఎలాంటి ఆందోళన చెందవద్దు. ముందుకు సాగండి. తొలి అడుగు వేయండి. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది’అని చెప్పారు. స్టార్టప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా తమ ఆలోచనలను పరివ్యాప్తం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న యువను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. బ్యాంక్ గ్యారంటీలు, రుణాలు ఇతర అంశాల విషయంలో యువత ఏ రకంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని ఇందుకు ఎలాంటి సహాయ, సహకారాలైనా ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్రం చేపట్టిన ముద్రా పథకం, స్కిల్ ఇండియా అలాగే స్టార్టప్ ఇండియా నిధులను ప్రస్తావించిన మోదీ యువ ఔత్సాహిక వ్యాపారవేత్తలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కొత్త ఆలోచనలను పాదుగొల్పుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే క్రీడలను కూడా తమ జీవితంలోనూ జీవనంలోనూ అంతర్భాగంగా మార్చుకోవాలన్నారు.