జాతీయ వార్తలు

ఏమిటా జాప్యం.. వివరణ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: ఆర్‌టీఐ దరఖాస్తులు సంబంధిత శాఖలకు పంపడంలో పీఎంఓ జాప్యాన్ని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఆర్‌కే మాథూర్ ఎండగట్టారు. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలని శుక్రవారం ఆయన ఆదేశించారు. సమాచార కమిషన్ల పోస్టుల కోసం అలాగే ఆర్‌టీఐ నియమావళి కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వేటీనీ పీఎంఓ సంబంధిత శాఖలు అప్పకుండా మిన్నకుంది. సమాచార కమిషనర్ల నియామకం, ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించిన బిల్లు వివరాలతోపాటు నాలుగు దరఖాస్తులు పంపినా సంబంధిత శాఖలు చేరలేదని సీ లోకేష్ బాత్రా సీఐసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐసీ చీఫ్ మాథూర్ తీవ్రంగానే స్పందించారు. ఏ సమాచారం కోసం అభ్యర్థించారో వాటి వివరాలు సంబంధిత శాఖకు పంపి వివరాలు రాబట్టి దరఖాస్తు దారునికి అందజేయాలని ఆర్‌టీఐ చట్టం చెబుతోంది. అలాంటి దరఖాస్తులను సంబంధిత మంత్రిత్వశాఖలు బదిలీ చేయాల్సిన బాధ్యత పీఎంఓకి ఉంది. దరఖాస్తు అందిన ఐదు రోజుల్లో వాటిని పరిష్కరించాలి. ఈ విషయాన్ని సమాచార చట్టంలోని సెక్షన్6(3) స్పష్టంగా చెబుతోంది. అయితే దీనికి విరుద్ధంగానే అంతా జరుగుతోందని బాత్రా ఆరోపించారు. తగిన సమాచారం అందడంతో విపరీతమైన జాప్యం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఎంఓ తీరు దారుణంగా ఉందని, సమాచారం మాట దేవుడెరుగు దరఖాస్తులు సకాలంలో సంబంధిత శాఖలకు బదిలీకావడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు కేసులను ఆయన ఉదాహరించారు.