జాతీయ వార్తలు

ఆద్యంతం ఆసక్తికరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జనవరి 17: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాల్గొన్న రోడ్ షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. ఇక్కడి సర్దార్ వల్లభభాయి పటేల్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకూ బుధవారం 8 కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోలో భారత్, ఇజ్రాయల్ జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. రోడ్ షో నిర్వహించిన మార్గంలో 50 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ వేదికల వద్ద వేలాదిమంది గుమికూడి ఇరు దేశాల ప్రధానులకు ఘన స్వాగతం పలికారు. భారత్, ఇజ్రాయల్ మైత్రీబంధం వర్ధిల్లాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో ఇజ్రాయల్ ప్రధాని పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మోదీతో పాటు నెతన్యాహు దంపతులు రోడ్ షోలో పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమాన్ని నెతన్యాహు దంపతులు సందర్శించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. గాంధీజీ వాడిన వివిధ వస్తువులను, నూలు వడికే చరఖాను వీరు ఆసక్తికరంగా పరిశీలించారు. ఆశ్రమ ప్రాంగణంలో నెతన్యాహు దంపతులు పతంగులను ఎగురవేశారు. గుజరాత్‌లో కోలాహలంగా జరిగే పతంగుల పండుగ గురించి వీరికి మోదీ వివరించారు. గతంలో జపాన్ ప్రధాని షింజో అబే సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించినపుడు, 2014లో చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ దంపతులు గుజరాత్‌లో పర్యటించినపుడు మోదీ వారి వెంట ఉన్నారు. అదే మాదిరి నెతన్యాహుకు సబర్మతి ఆశ్రమం గురించి, గాంధీజీ జీవిత విశేషాల గురించి తెలిపారు.
నవీన ఆవిష్కరణలకు ప్రాధాన్యం
కొత్త ఆలోచనల ద్వారా కొత్త ఆవిష్కరణలు జరుగుతాయని, వాటితోనే నూతన భారత్ అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అహ్మదాబాద్ సమీపంలోని దేవ్ ధొలెరా గ్రామంలో ‘ఐ క్రియేట్’ కేంద్రాన్ని ఇజ్రాయల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్’ (పీపీపీ) ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నిధులు, స్థలాలు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇక్కడి యువతలో శక్తి, ఉత్సాహం పుష్కలంగా ఉన్నాయని, వారికి కాస్త ప్రోత్సాహం, మద్దతు ఇవ్వాల్సి ఉందన్నారు. గత ఏడాది తాను ఇజ్రాయల్‌లో పర్యటించినపుడు ‘ఐ క్రియేట్’ కేంద్రం ఏర్పాటు గురించి తనకు ఆలోచన వచ్చిందని, ఇటువంటి కేంద్రాలు ఇరు దేశాల మధ్య మైత్రీబంధాన్ని మరింత పటిష్ఠవంతం చేస్తాయని మోదీ అన్నారు. ఈ కేంద్రాన్ని నెతన్యాహుతో కలిసి తాను ప్రారంభించడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. నూతన ఆవిష్కరణల కోసం రెండు దేశాలూ భాగస్వామ్యం కావల్సి ఉందన్నారు. కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు భారత్ ఇపుడు ఓ నిదర్శనంగా మారిందన్నారు. ‘ఐ క్రియేట్’ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకెంతో సంతృప్తి కలిగించిందని నెతన్యాహు అన్నారు. ‘ప్రపంచానికి ఇప్పటివరకూ ఐపాడ్స్, ఐపోడ్స్ గురించే తెలుసునని, అయితే ఇపుడు ‘ఐ-క్రియేట్’ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన మోదీని ‘మై డియర్ ఫ్రెండ్’ అని సంబోధిస్తూ తన ప్రసంగం ప్రారంభించారు. ‘జై హింద్, జై భారత్, జై ఇజ్రాయల్, థాంక్యూ ప్రైమ్‌మినిస్టర్ మోదీ’ అని ముగించారు.

చిత్రాలు..ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ గాలిపటాన్ని ఎలా ఎగురవేస్తారో వివరించి, ఎగరేసి చూపిస్తున్న మోదీ. సబర్మతి ఆశ్రమంలో నూలు వడికే యంత్రం గురించి నెతన్యాహు దంపతులకు వివరిస్తున్న ప్రధాని