జాతీయ వార్తలు

నలిగిపోతున్న కాశ్మీర్ ప్రజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 20: పాక్, భారత్ మధ్య గొడవలకు కాశ్మీర్‌లో అమాయక ప్రజలు బలైపోతున్నారని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య శత్రుత్వానికి కాశ్మీరీయులే బాధితులుగా మిగిలిపోతున్నారని శనివారం ఇక్కడ విమర్శించారు. రెండు రోజులుగా సరిహద్దుల్లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.‘కాల్పులకు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు దేశాల వైరం జమ్మూకాశ్మీర్ ప్రజలనే కబళిస్తోంది. సరిహద్దులో సాధారణ పరిస్థితులు ఏర్పడాలని ప్రార్ధిస్తున్నాను’అంటూ ముఫ్తీ పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ), జమ్మూ డివిజన్‌లోని ఎల్‌ఓసీ వద్ద మూడో రోజు శనివారం కూడా కాల్పులు చోటుచేసుకోవడంపై ఆమె ఆందోళన చెందారు. పాకిస్తాన్ దళాల కాల్పుల్లో ముగ్గురు చనిపోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. 17 ఏళ్ల యువతి, ఓ బీఎస్‌ఎఫ్ జవాన్ శుక్రవారం నాటి కాల్పుల్లో చనిపోయారు. జమ్మూ, సాంబా జిల్లాల్లో ఆరుగురు గాయపడ్డారు. గత మూడు రోజులుగా సరిహద్దులో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ మూడు రోజుల్లో కాల్పులకు కనీసం తొమ్మిది మంది మృతి చెందారని ముఖ్యమంత్రి వెల్లడించారు. పూంచ్ జిల్లా కృష్ణా ఘాటీ సెక్టార్‌లో బులెట్ దూసుకుపోయి ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మణ్‌దీప్ సింగ్ పంజాబ్‌లో అలాంపూర్‌కు చెందినవాడు. కృష్ణాఘాటీలో పాకిస్తాన్ జవాన్లు ఎలాంటి కవ్వింపుచర్యలు లేకుండా ఏకపక్షంగా కాల్పులకు తెగబడ్డారని రక్షణశాఖ ప్రతినిధి వెల్లడించారు. పాక్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మణ్‌దీప్ సింగ్ తరువాత మృతి చెందాడని ఆయన అన్నారు. అయితే పాక్ దుశ్చర్యలను భద్రతాదళాలు గట్టిగానే ప్రతిఘటించాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ భద్రతాదళాల కాల్పులకు సరిహద్దులోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జనవాసాలనే లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కాల్పులకు ఇళ్లు ధ్వంసమవుతున్నాయి.

చిత్రం..పాక్ సైనికుల కాల్పుల్లో గాయపడిన బీఎస్‌ఎఫ్ జవాన్‌ను ఆర్.ఎస్.పురాలోని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం