జాతీయ వార్తలు

ఎన్నికలకు భయపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: లాభదాయక పదవుల్లో అనర్హతవేటు వేయాలంటూ ఎన్నికల సంఘం రాష్టప్రతికి సిఫార్సు చేసినంత మాత్రాన భయపడొద్దని అధికార ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చింది. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ఈసీ రాష్టప్రతికి నివేదించిన సంగతి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయన్న భయం అక్కర్లేదని బాధిత ఎమ్మెల్యేలకు ఢిల్లీ ఆప్ విభాగం అధ్యక్షుడు గోపాల్ రాయ్ స్పష్టం చేశారు. పార్టీ అభిప్రాయం తెలుకోకుండానే ఈసీ ఏకపక్షంగా రాష్టప్రతికి సిఫార్సు చేసిందని శనివారం ఆయన ఆరోపించారు. ‘ఈసీ చర్య నూటికి నూరుపాళ్లూ అప్రజాస్వామికం. ఢిల్లీ ప్రజలపై, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై జరుగుతున్న కక్ష సాధింపులో భాగమే ఇదంతా’ అని ఆయన విమర్శించారు. పార్లమెంటు కార్యదర్శుల పదవులన్నవి 11 రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, ఇది ఒక్క ఢిల్లీ రాష్ట్రానికే పరిమితం కాదని గోపాల్ చెప్పారు. ఈ ద్వంద్వ విధానం రాజ్యాంగ విరుద్ధమేనని ఆయన అన్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపునకు ఇది పరాకాష్టగా చెప్పవచ్చని ఆప్ చీఫ్ ఎద్దేవా చేశారు. బ్రిటీష్ పాలనకన్నా దారుణంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈసీ కక్ష సాధింపుపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని రాయ్ వెల్లడించారు. ఈసీ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో ఆప్ సవాల్ చేయగా సోమవారం ఇది విచారణకు రానుంది. ‘్ఢల్లీ ప్రజలు మాతోనే ఉన్నారు. ఎన్నికలకు మేం భయపడం. ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి అభీష్టం మేరకే నడుచుకుంటాం’ అని ఆయన ఉద్ఘాటించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆప్ నాయకులు గోపాల్ రాయ్, దిలీప్ పాండే