జాతీయ వార్తలు

తీర రక్షణకు పటిష్ఠ ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 21: జిల్లాలోని కోస్తా తీర ప్రాంతంలో భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నారు. సముద్రంలో ప్రయాణించే నౌకలు, ఫిషింగ్ బోట్లపై పటిష్ట నిఘా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు కోస్తా తీర ప్రాంత భద్రతకై ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. కమిటీ పర్యవేక్షణలో తీరప్రాంతంలో నిఘా, రక్షణ చర్యలకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. ఇందుకు కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీస్, కస్టమ్స్, మత్స్యశాఖాధికారుల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతాచర్యల్లో భాగంగా కోస్తా తీర ప్రాంతంలోని పోర్టులు, రెవెన్యూ శాఖలకు చెందిన స్థలాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేక జెట్టీలు నిర్మించనున్నారు. ఈ జెట్టీల నుండి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు సముద్రంలో సంచరించే నౌకలు, ఫిషింగ్ బోట్లపై పటిష్ట నిఘా ఉంచుతారు. వేటకు వెళ్ళే ప్రతి బోటుకు రిజిస్ట్రేషన్ చేయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన రంగులను సదరు బోట్లకు వేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇటీవలి కాలంలో తూర్పు తీర ప్రాంతంలోని మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు జారీచేస్తున్నారు. ఇప్పటికే సుమారు 50వేల మంది మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులు జారీ చేశారు. మిగిలిన మత్స్యకారులను మత్స్యశాఖాధికారులు యుద్ధప్రాతిపదికన గుర్తించి బయోమెట్రిక్ కార్డులు జారీచేసే పనిలో ఉన్నారు. అన్ని రకాల మర పడవలకు డాట్ (డిట్రస్ ఎలర్ట్ ట్రాన్సిమిటర్లు) ఏర్పాటుచేయాలని తీర ప్రాంత భద్రతా కమిటీ నిర్ణయించింది. ఫిబ్రవరి 15వ తేదీలోగా డాట్ పరికరాలు ఏర్పాటుచేసుకోని మర పడవల లైసెన్స్‌లు రద్దుచేయాలని కమిటీ ప్రకటించింది. డాట్ పరికరాన్ని అమర్చిన మర పడవ ప్రమాదవశాత్తూ అదృశ్యమైన పక్షంలో సాంకేతిక సహాయంతో దాని ఆచూకీ లభిస్తుంది. గతంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో అనేక బోట్లు సముద్రంలో గల్లంతు కావడంతో పలువురు మత్స్యకారులు మృతిచెందిన సందర్భాలున్నాయి. తుపాన్ల సమయంలో ముందుజాగ్రత్తగా హెచ్చరించే అవకాశం డాట్‌తో సాధ్యమవుతుంది. గల్లంతైన బోటు ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంది. భద్రతా చర్యల్లో భాగంగా నోటిఫైడ్, నోటిఫై కాని ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రభుత్వ బృందాలు నిరంతరం ఫిష్ ల్యాండింగ్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా జాగ్రత్త వహిస్తున్నారు. కోస్తా తీరంలో మత్స్యకారులు వినియోగించే పడవలకు ఆలివ్ రిడ్లే తాబేళ్ళను రక్షించే పరికరాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తాజాగా తీర ప్రాంత పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై మత్స్యకారులు, మర పడవల యజమానులకు ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.