జాతీయ వార్తలు

సీఎం, రాజ్‌నాథ్ రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛందౌలీ (యూపీ), జనవరి 22: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ కాల్పుల్లో మృతి చెందిన జవాన్ చందన్ కుమార్ రాయ్ అంత్యక్రియలకు కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరుకావాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాయ్‌కు వచ్చేనెలలో పెళ్లి నిశ్చయించారు. అతడు వచ్చేనెలలో స్వగ్రామం రావల్సి ఉండగా పాక్ దళాల కాల్పుల్లో మృతి చెందాడు. మృతదేహాన్ని ఛందౌలీ జిల్లా మదేసార్-మరుఫ్‌పూర్ గ్రామానికి తరలించారు. అంత్యక్రియలు జరిగే సమయంలో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. హోమ్‌మంత్రి రాజ్‌నాథ్, సీఎం ఆదిత్యనాథ్ రావల్సిందేనని ధర్నాకు దిగారు. రాజ్‌నాథ్ సొంత జిల్లా ఛందౌలీ కాగా ఆదిత్యనాథ్ పూర్వికులు ఈ జిల్లాకు చెందినవారే. ఈ జిల్లాకే చెందిన ఇద్దరు నేతలు అమర జవాన్ అంత్యక్రియలకు రావాలని వారు పట్టుబట్టారు. యూపీ మంత్రులు అనిల్ రాజ్‌భార్, జైప్రకాశ్ నిషాద్, జిల్లా మెజిస్ట్రేట్ హేమంత్ కుమార్, ఎస్పీ సంతోష్ సింగ్ జవాన్ మృతదేహానికి నివాళులర్పించారు. స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు రాయ్‌మృతికి సంతాపం తెలిపారు.