జాతీయ వార్తలు

కేరళ ఫాదర్‌ను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం: సుష్మా స్వరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: యెమెన్‌లో గత నెల ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన కేరళ ఫాదర్‌ను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం తెలిపారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే నాడు ఆ పూజారిని ఉరితీయాలని సదరు ఉగ్రవాద గ్రూపు నిర్ణయించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో సుష్మా స్వరాజ్ పై విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాదులు ఆ పూజారికి హాని తలపెట్టినట్లు ఇప్పటివరకూ ఎటువంటి వార్తలు అందలేదు. ‘యెమెన్‌లో కేరళకు చెందిన ఫాదర్ టామ్ ఉజున్నలిల్‌ను ఉగ్రవాద గ్రూపు కిడ్నాప్ చేసింది. ఆయనను విడిపించేందుకు మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సుష్మా స్వరాజ్ తెలిపారు. యెమెన్‌లో మదర్ థెరిస్సా చారిటీ మిషనరీలు నిర్వహిస్తున్న కేర్ హోమ్‌పై గత నెలలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు దాడి చేసిన నాటి నుంచి ఫాదర్ ఉజున్నలిల్ కనిపించడం లేదు. అయితే సాయుధ సంఘర్షణలతో అట్టుడుకుతున్న యెమెన్‌లో భారత్‌కు రాయబార కార్యాలయమేదీ లేదని, అయినప్పటికీ ఫాదర్ ఉజున్నలిల్‌ను కాపాడేందుకు శక్తివంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సుష్మా స్వరాజ్ ఇంతకుముందు ‘ట్వీట్’ చేశారు.