జాతీయ వార్తలు

జిల్లాల అభివృద్ధి పథకానికి మూడు రాష్ట్రాల విముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: దేశవ్యాప్తంగా 115 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకంలో చేరేందుకు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు విముఖత చూపుతున్నాయి. ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు కేంద్రం తన అధికారులను నియమించడమే ఇందుకు ఇందుకు కారణం. కేంద్రం ఎంపిక చేసిన జిల్లాల్లో కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన 14 జిల్లాలు ఉన్నాయి. కేరళలో సిపిఎం, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. 115 జిల్లాలను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్దేశించిన పథకంపై ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు అయిష్టతను వ్యక్తం చేస్తున్నాయి. కాగా, రాజకీయ కారణాలతో మాత్రమే కేరళ, బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు జిల్లాల అభివృద్ధి పథకంపై విముఖతను ప్రదర్శిస్తున్నాయని కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ ఆరోపించారు. ఈ తరహా ధోరణి వల్ల అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. విద్య, వైద్యం, పేదరికం, సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 115 వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేశామని ఆయన గుర్తు చేశారు. తీవ్రవాదం, వేర్పాటువాదం ప్రభావంతో వెనుకబడిన 35 జిల్లాలను అభివృద్ధి చేయాలని హోం మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన జిల్లాల్లో కొన్నింటిని ప్రధాని నరేంద్ర మోదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే ఏప్రిల్ 14న సందర్శిస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ జిల్లాలను అభివృద్ధి చేస్తారు. 2022 నాటికి ఈ జిల్లాలను అభివృద్ధి చేసేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తామని, జిల్లా కలెక్టర్లు ఇందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మోదీ ఇదివరకే విజ్ఞప్తి చేశారని రామ్ కృపాల్ యాదవ్ తెలిపారు. ప్రతి మూడు జిల్లాలకు ఒక అధికారిని కేంద్రం నియమించింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలను మెరుగుపరచే విధంగా ప్రధాని చర్యలు తీసుకుంటున్నారని, అయితే రాజకీయ కారణాలతో ఇలాంటి పథకాలపై కొన్ని రాష్ట్రాలు విముఖత చూపడం సరికాదన్నారు. వెనుకబడిన జిల్లాలకు దండిగా నిధులిస్తామంటే అయిష్టత తెలపడం రాజకీయం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు.