జాతీయ వార్తలు

ప్రతికూల పరిస్థితుల్లోనూ తలొగ్గం: రాజ్‌నాథ్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బారాబంకి (యుపీ), జనవరి 22: అంతర్జాతీయ సరిహద్దు వెంబడి, వాస్తవాధీన రేఖ వద్ద భారతీయ పోస్టులపై పాక్ సైనికుల కాల్పులు కొనసాగుతున్న క్రమంలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశానికి గట్టి హెచ్చరిక చేశారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భారత్ తలవంచే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కుయుక్తులకు పాల్పడుతున్న వారికి దీటుగా జవాబు చెప్పేందుకు తాము సిద్ధమేనని ఆయన సోమవారం ఇక్కడ జరిగిన ఓ సభలో అన్నారు. పాక్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎంత మాత్రం బలహీన దేశం కాదని, విశ్వవేదికపై భారత్ ప్రతిష్ఠ ఇటీవలి కాలంలో మరింతగా ఇనుమడించిందని రాజ్‌నాథ్ వివరించారు. భారత్ తన ప్రత్యర్థులను తమ భూభాగంలోనే గాక, వారి భూభాగంపైకి దూసుకువెళ్లి మరీ ఎదురిస్తుందని కొద్ది రోజుల ముందు హెచ్చరించిన ఆయన ఇపుడు తన స్వరం పెంచారు. జమ్మూ కాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలపై పాక్ సైనికులు మూడు రోజులుగా విరుచుకుపడి సాధారణ పౌరులను, జవాన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని మూడు జిల్లాల్లో పాక్ బలగాలు జరిపిన దాడుల్లో 12 మంది మరణించగా, 60మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ ఈ ఘాతుకాలకు పాల్పడుతోంది. శత్రువులకు తగిన గుణపాఠం చెప్పే దేశంగా ప్రపంచంలోనే భారత్ ప్రతిష్ఠ పెరిగిందని హోం మంత్రి అన్నారు. అరాచకాలకు పాల్పడే ఏ దేశాన్నీ భారత్ ఉపేక్షించందని పరోక్షంగా పాక్‌ను ఆయన హెచ్చరించారు. రాజ్‌నాథ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.