జాతీయ వార్తలు

ఆ రెండు పిటిషన్లు మాకు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: జస్టిస్ లోయ మృతికి సంబంధించి బాంబే హైకోర్టులో ఉన్న రెండు పిటిషన్లు సుప్రీం కోర్టుకు బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. లోయ మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. లోయ మృతికి సంబంధించి అన్ని పత్రాలు వచ్చేవాయిదా ఫిబ్రవరి 2 నాటికి తమకు అందజేయాలని బెంచ్ ఆదేశించింది. బాంబే హైకోర్టు అలాగే నాగ్‌పూర్ బెంచ్‌లో చెరొక పిటిషన్ పెండింగ్‌లో ఉన్నాయి. ‘పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను తీవ్రంగా పరిగణిస్తున్నాం’ అంటూ జస్టిస్ ఏఎం ఖన్వికర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే లోయ అనుమానాస్పద మృతికి సంబందించిన ఏ కేసూ దేశంలోని ఏ న్యాయస్థానంలో విచారించ వద్దని సుప్రీం ఆదేశించింది.