జాతీయ వార్తలు

అన్నీ వ్యక్తిగత ముచ్చట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిగ్‌బజార్ ద్వారా రద్దయిన పాత 100, 500 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఇచ్చినంత ప్రాధాన్యత రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు ఇవ్వలేదని రాష్ట్ర కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ఆరోపించారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విభజన ఆంశాల సాధనపై చంద్రబాబుకు రాసిన లేఖను విడుదల చేశారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీల సాధనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబును ఏ శక్తి ఆపుతోందని రామచందర్‌రావు నిలదీశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీనాడు పూర్తి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రతిపాదిస్తోంది, ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చేర్చుకోవటంలో నాయుడు విఫలమయ్యే పక్షంలో, రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత ఆయనను క్షమించదు, చరిత్రహీనుడుగా మిగిలిపోతారని రామచందర్‌రావు ఆరోపించారు. చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చినా తన వ్యక్తిగత ప్రయోజనాలు, హెరిటేజ్ ప్రయోజనాలు, పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల ప్రయోజనాల గురించి చర్చిస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎందుకు చర్చించటం లేదని నిలదీశారు.
పోలవరం కాంట్రాక్టర్ల ప్రయోజన పరిరక్షణ కోసమే ఎన్‌డీఏ ప్రభుత్వంతో గొడవ పడుతున్నారు తప్ప విభజన హామీలకోసం కాదని అన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోతే సుప్రీం కోర్టుకు వెళతానని హెచ్చరిస్తున్న నాయుడు తన పిటిషన్‌లో ప్రతివాదులుగా ఎవరిని పేర్కొంటారని కేవీపీ నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్నర సంవత్సరాలు కావస్తున్నది, ఈ కాలంలో చంద్రబాబు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. పెద్ద పెద్ద మాటలు చెప్పే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కటంద్వారా రాష్ట్ర యువతను అన్యాయం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించారని ఇప్పుడు తెలుసుకోవటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అదుకోవటం లేదని చంద్రబాబు ఆరోపించటాన్ని రామచందర్‌రావు ఖండించారు. నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు, తన అవసరాలు తీరటం లేదు కాబట్టే కేంద్రంపై దాడికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు రేపు ఏపీ ప్రజలను తప్పుపడతారు, మీరు ఉద్యమించలేదు కాబట్టే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రాలేదనే ఆరోపణలు చేస్తారని రామచందర్‌రావు అన్నారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో నాగపూర్‌కు వెళ్లి జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల రేటు గురించి మాట్లాడటం ఏమిటని నిలదీశారు. పోలవరం నిర్మాణం గురించి చర్చించాలి కదా? అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపేందుకు ప్రధాని మోడీ మెడలు వంచానని చంద్రబాబు చెప్పుకుంటారు.. ఇదే నిజమైతే ప్రత్యేక ప్యాకేజీ సాధించేందుకు మరోసారి మోడీ మెడలు వంచగలరా? అని సవాల్ చేశారు. ప్యాకేజీ, ప్రత్యేక రైల్వే జోన్ తదితర హామీల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు వత్తిడి తీసుకురావటం లేదు? పోలవరం వాటాల గురించి అడుగుతారని భయపడుతున్నారా? అని రామచందర్‌రావు ప్రశ్నించారు. అమరావతిలో వందలు, వేల ఎకరాల భూమిని పప్పుబెల్లాల మాదిరి పంచి పెట్టటం గురించి కేంద్రం ప్రశ్నిస్తుందని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్‌కు శాపంగా మారిందని దుయ్యబట్టారు. విభజన చట్టం మూలంగా ఏపీకి ఇచ్చిన పథకాలు, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను రానున్న బడ్జెట్‌లో పొందుపరిచేలా కేంద్రంపై ఒడ్తితి తీసుకురావాలి, లేకుంటే బాబును చరిత్ర క్షమించదని రామచందర్ రావు స్పష్టం చేశారు. మీరు ఇకనైనా మీ కుటుంబ ప్రయోజనాలు, హెరిటేజ్ ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల సాధనకు, విభజన చట్టం హామీల అమలుకు కృషి చేయాలని ఆయన బాబుకు హితవు చెప్పారు. ఇది విజ్ఞప్తితో కూడిన హెచ్చరిక అని రామచందర్‌రావు తెలిపారు.