జాతీయ వార్తలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హత వివాదంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కోమటిరెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు విచారణలో ఉన్న పిటిషన్‌కు సంబంధించి అనుబంధ పిటిషన్‌ను అనుమతించాలంటూ కంచర్ల భూపాల్‌రెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. నామినేషన్ పత్రాల్లో తన విద్యార్హతను కోమటిరెడ్డి బీఈగా చూపారని, కాని ఉతీర్ణత సాధించలేదని, వీటికి సంబంధించిన కొన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని, ఉమ్మడి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేయగా తోసిపుచ్చిందని, దీన్ని అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును భూపాల్‌రెడ్డి ఆశ్రయించారు.
ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్ ఉమ్మడి హైకోర్టులో విచారణలో ఉన్నందున అక్కడే వాదనలు వినిపించాలని ధర్మాసనం సూచించింది. హైకోర్టు విచారణలో ఉన్న ప్రధాన పిటిషన్ విచారణ సమయంలో వాదించుకోవాలని సూచిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.