జాతీయ వార్తలు

మూడు నెలల్లో తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేసే విషయంలో 2016లో తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. రాజీవ్ హత్యకేసు దోషులను విడుదల చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అయితే 2015 నాటి సుప్రీం కోర్టు ఉత్తర్వు ప్రకారం కేంద్రం అనుమతితోనే దీన్ని అమలుచేయాల్సి ఉంటుందని 2016 మార్చి 2న రాసిన లేఖలో తమిళనాడు సర్కార్ స్పష్టం చేసింది. 3 నెలల్లో తమిళనాడు లేఖపై నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, ఎఎం సప్రే, నవీన్ సిన్హాలతో కూడిన సుప్రీం ధర్మాసనం అదనపుసొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు కోరింది. తమిళనాడు ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది రాజీవ్ హంతకుల డిమాండ్‌కు మద్దతు తెలిపారు. వీరిని విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లేఖపై ఎలాంటి జాప్యం లేకుండా స్పందించాలని కేంద్రాన్ని కోరారు.