జాతీయ వార్తలు

సీజేఐను అభిశంసించేందుకు విపక్షాలతో చర్చలు: ఏచూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అభిశంసించే విషయమై అన్ని విపక్ష పార్టీలతో చర్చిస్తున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, సహచర న్యాయమూర్తులే దీపక్ మిశ్రాపై ఇటీవల ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ‘ఎంపిక చేసిన కేసుల’ను కొంతమంది జడ్జీలకు అప్పగిస్తూ మిశ్రా వివక్ష చూపుతున్నారని ఇటీవల నలుగురు న్యాయమూర్తులు ఆరోపించిన సంగతి తెలిసిందే.
దేశ న్యాయవ్యవస్థలోనే తొలిసారిగా న్యాయమూర్తులు ఇలా సీజేఐ వ్యవహార శైలిపై విమర్శలు చేయడం సంచలనం రేపింది. ఈ అనుకోని పరిణామంతో న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై ప్రజలకు అనుమానాలు కలిగే పరిస్థితి ఏర్పడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించే విషయమై కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నట్లు ఏచూరి వెల్లడించారు. 2018-19 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ, ఆ తర్వాత విరామం అనంతరం మార్చి 5 నుంచి ఏప్రిల్ 6 వరకూ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.