జాతీయ వార్తలు

మధ్యలో ఎన్‌ఐఏ ఏంటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లవ్ జిహాదీ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హాదియా మేజర్ అయినందున ఎవర్ని పెళ్లాడాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉందని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. అలాగే ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీరును కోర్టు తప్పుపట్టింది. ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకుంటే మధ్యలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేయడానికి ఏముంటుంది? అని జస్టిస్ ఎంఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం నిలదీసింది. అలాగే మేజర్ అయిన హాదియా స్వేచ్ఛను కాదని ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించలేమని సుప్రీం తేల్చిచెప్పింది. హాదియా, షాఫిన్ జహాన్‌ల పెళ్లి చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పునివ్వడం కుదరదని బెంచ్ స్పష్టం చేసింది. ఎవర్ని వివాహం చేసుకోవాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హాదియాకు ఉంది. ఆమె మేజర్ అంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది. గత ఏడాది నవంబర్ 27న హాదియాకు తల్లిదండ్రుల కస్టడీ నుంచి సుప్రీం కోర్టు విముక్తి ప్రసాదించింది. మెడికో అయిన యువతి చదువుకు ఎలాంటి ఆటంకం కల్పించవద్దని, కాలేజీకి వెళ్లనీయమని కోర్టు ఆదేశించింది. హిందూ కుటుంబానికి చెందిన 25 ఏళ్ల యువతి హాదియాగా పేరుమార్చుకుని ముస్లిం యువకుడు జహాన్‌ను పెళ్లాడింది. వీరి వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు రద్దుచేసింది. దాన్ని జహాన్ సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు.