జాతీయ వార్తలు

తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, మార్చి 26: కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ శనివారం రాష్ట్ర శాసనసభ స్పీకర్ గోవింద్ సింగ్ కున్‌జ్వాల్‌ను కోరారు. రావత్.. స్పీకర్ కున్‌జ్వాల్‌తో భేటీ అయి తన వాదన వినిపించారు. సోమవారం శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న తరుణంలో రావత్ ఈ డిమాండ్ చేయడమే కాకుండా తన డిమాండ్ న్యాయబద్ధమైందని పేర్కొన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని నోటీసు ఇచ్చిన రావత్.. స్పీకర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన విజ్ఞాపనను సమర్థించే పత్రాలు అందజేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, మరో ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 70 మంది సభ్యులున్న సభలో 36మంది బలం గల కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మంది నుంచి తిరుగుబాటును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.