జాతీయ వార్తలు

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా పంజాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 13: కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే నెల రోజుల్లోనే పంజాబ్‌లో మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేస్తామని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జలంధర్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన జరిగిన ధర్నాలో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం అత్యంత తేలిగ్గా మారిపోయిందని, ఈ మహమ్మారిని నిరోధించడంలో ఆకాలీదళ్ ప్రభుత్వం విఫలమైందని రాహుల్ విమర్శించారు. ‘డ్రగ్స్‌ను నిర్మూలిస్తేనే పంజాబ్‌కు భవిష్యత్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధ్వజమెత్తారు. అకాలీదళ్ పాలనలో మాదకద్రవ్యాల చలామణి విచ్చలవిడిగా సాగిపోతోందని, దీన్నివల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన విరుచుకుపడ్డారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే డ్రగ్స్ సమస్యను పరిష్కరిస్తామని అలాగే పోలీసులకు మరిన్ని అధికారాలు ఇస్తామని రాహుల్ వెల్లడించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఒకరిద్దరు మంచి అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ శిరోమణి అకాలీదళ్, బిజెపి సంకీర్ణ ప్రభుత్వం వారికి స్వేచ్ఛను ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ సమస్యపై నాలుగేళ్ల క్రితమే తాను ఆందోళన వ్యక్తంచేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎగతాళి చేసిందని ఆయన విమర్శించారు. ఇలా ఉండగా మాదకద్రవ్యాల విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. మన్మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఇదే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆప్ పేర్కొంది.

చిత్రం పంజాబ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోవడం, శాంతిభద్రతలు క్షీణించినందుకు నిరసనగా సోమవారం జలంధర్‌లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వెలుపల ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ