జాతీయ వార్తలు

భవిత మనదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జూన్ 13: మరో మూడేళ్లలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు బిజెపి పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ క్షీణిస్తోందని, వర్తమానం, భవిత కూడా తమదేనని ఉద్ఘాటించింది. రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్య నిర్వాహక వర్గం సమావేశం ముగింపు సందర్భంగా సోమవారం ఈ మేరకు ఓ తీర్మానాన్ని చేపట్టింది. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు, కేరళ వరకూ అన్ని తీర ప్రాంత రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని, ఆ విధంగా 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మరో పెద్ద విజయం సాధించేందుకు సమాయత్తం కావాలని ఈ తీర్మానంలో కోరింది. వర్తమానం, భవిత తమదేనని నిరూపించుకున్న బిజెపి అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని సంతరించుకుని దూసుకు పోతోందని పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగెస్ బలహీన పడటంతో దేశ వ్యాప్తంగా బిజెపి వేళ్లూనుకుంటోదని, మిగతా పార్టీలదంతా ప్రాంతీయంగా పరిమితమైన బలమేనని ఈ తీర్మానంలో విశే్లషించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో విజయం సాధించిన బిజెపి కేరళ, పశ్చిమ బెంగాల్‌లో కూడా తన ఓటు శాతాన్ని పెంచుకుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని తెలిపారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ విముక్త భారత్‌ను సాధించాలన్న ప్రధాని మోదీ పిలుపు ఇప్పుడు ప్రజోద్యమంగా మారిందనీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి సాధించిన విజయం కేవలం మరో ఎన్నికల విజయంగా ఎంత మాత్రం భావించడానికి వీల్లేదని, ఏ విధంగా చూసినా అది పార్టీ సాధించిన సైద్ధాంతిక విజయమని తెలిపింది.

చిత్రం అలహాబాద్‌లో పరివర్తన్ ర్యాలీ వేదిక నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులు