జాతీయ వార్తలు

చిచ్చు వద్దు.. చర్చిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: కృష్ణా బోర్డు వ్యవహారంపై రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాన్ని చక్కదిద్దేందుకు కేంద్రం సమాయత్తమైంది. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈనెల 21న రెండు రాష్ట్రాల సాగునీటి మంత్రులు, అధికారులతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణాపై నిర్మించిన నీటినీటి ప్రాజెక్టుల నిర్వహణను తమ పరిధిలోకి తెచ్చుకునేందుకు వీలుగా బోర్డు మే 27న ఒక ముసాయిదాను ప్రతిపాదించటం తెలిసిందే. ముసాయిదాను కేంద్రానికి సమర్పిస్తూ అధికారికంగా ప్రకటించాలని బోర్డు కోరింది. అయితే బోర్డు రూపొందించిన ముసాయిదాను తెలంగాణ సర్కారు గట్టిగా వ్యతిరేకిస్తుంటే, ఆంధ్ర ప్రభుత్వం మాత్రం మద్దతు ప్రకటించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను తమ పరిధిలోకి తీసుకునేందుకు బోర్డు రూపొందించిన ముసాయిదా ప్రతిపాదన పూర్తి ఏకపక్షంగా ఉందని తెలంగాణ వాదిస్తోంది. దీనిపై ఇప్పటికే తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల యాజమాన్య నిర్వహణా బోర్డుకు నీటి కేటాయింపు అధికారం ఉండదని హరీశ్ వాదించారు. బోర్డు రూపొందించిన ముసాయిదాను యథాతథంగా అమలు చేయాలని కోరుతూ ఏపీ సిఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. బోర్డు నోటిఫికేషన్‌ను అమలు చేస్తే కోర్టుకెళ్తామని హరీశ్‌రావు హెచ్చరించటంతో, రెండు రాష్ట్రాల మధ్య వ్యవహారం పూర్తిగా ముదిరింది. దీంతో సమస్యను పరిష్కరించేందుకు ఉమాభారతి రంగంలోకి వచ్చారు. నోటిఫికేషన్ వివాదం గురించి చర్చించేందుకు ఢిల్లీకి రావాలని ఆమె ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాశారు. జూన్ 21న ఏర్పాటు చేసిన సమావేశంలో రెండు రాష్ట్రాల వాదనలపై అక్కడిక్కడే చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఉమాభారతి ఆలోచిస్తున్నారు. ఉమాభారతి అధ్యక్షతన జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల మంత్రులు, ఆ శాఖ శాఖ కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు, కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ అధికారులు, కేంద్ర జల సంఘం సీనియర్ అధికారులు పాల్గొంటారని తెలిసింది. కృష్ణా బోర్డు నోటిఫికేషన్ వివాదంపై కేంద్ర జల వనరుల శాఖ ఒక ప్రత్యేక నోట్‌ను తయారు చేస్తున్నట్టు తెలిసింది. కృష్ణా బోర్డు పరిధి ఏమిటి? కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే అధికారం బోర్డుకు ఉన్నదా? లేదా? తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నట్టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాకముందే కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాల మధ్య కేటాయించేందుకు బోర్డుకు వీలున్నదా? లేదా? అనేది సమావేశంలో నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కృష్ణా నదీ జలాల బోర్డు చైర్మన్ ఆర్‌కె గుప్తా ఆంధ్ర ప్రభుత్వం సూచించిన విధంగా నోటిఫికేషన్‌ను తయారు చేసి కేంద్రానికి పంపించారంటూ హరీశ్‌రావు చేసిన ఆరోపణల్లోని నిజానిజాలను కూడా జూన్ 21 సమావేశంలో నిగ్గు తేలుస్తారని అంటున్నారు.