జాతీయ వార్తలు

ప్రగతి సారథులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జూన్ 13: బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి వెల్లువెత్తుతోందని..అద్భుతమైన ప్రగతి ర్యాంకింగ్‌లు సాధిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బిజెపి రెండురోజుల కార్యనిర్వాహక వర్గం ముగింపు సందర్భంగా ఇక్కడ సోమవారం జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. కుల,మత, ఆశ్రీత పక్షపాతమే యూపీలోని అధికార సమాజ్‌వాది పార్టీ లక్షణంగా మారిందన్నారు.రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా అధికారాన్ని పంచుకుంటున్న ఎస్‌పి, బిజెపిలు అవినీతికి పాల్పడుతున్నాయంటూ ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలోకి వచ్చినా రెండో పార్టీ అవినీతిని విస్మరిస్తోందన్నారు. హెలికాప్టర్లు, విమానానలు, శతఘు్నలు, వంట గ్యాస్ సబ్సీడీలోనూ అవినీతే జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో అధికారానికి వచ్చే అవకాశాన్ని తమ పార్టీకి కట్టబెట్టాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే జరిగితే పవిత్ర గంగ,యమున, సరస్వతి నదులు ప్రవహించే ఉత్తర ప్రదేశ్‌లో అభివృద్ధి నవశకం మొదలు అవుతుందన్నారు. ఇందుకోసం కుల, మత తత్వాలను ఆశ్రీత పక్షపాతాన్ని అభివృద్ధి పవిత్ర యజ్ఞంలో ఆహుతి చేయాలని మోదీ, మోదీ అన్న నినాదాల మధ్య ప్రధాని పేర్కొన్నారు. దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. క్లాస్ 3,4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూలను తొలగించామన్నారు. ఇదే పద్ధతిలో ముందుకు వెళ్లాలని రాష్ట్రాలను కోరినా..యూపీలో ఇందుకు భిన్నమైన పరిస్థితే నెలకొందన్నారు.
మోదీ సప్త మంత్రాలు
‘ప్రజల పట్ల మన ప్రవర్తనలో సహానుభూతి కనపించాలి. సహనం కనపరచాలి. ఉరకే నినాదాలు చేయటం కాదు..దేశాన్ని బలోపేతం చేయటం గురించి దృష్టి సారించాలి.’ భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగింపు రోజైన సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగ సారాంశమిది. దేశంలో నెలకొన్న ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా మోదీ తన పార్టీ కార్యకర్తలకు ఏడు మంత్రాలను ఉపదేశించారు. ‘సేవాభావం, సంతులనం, సంయమనం, సమన్వయం, సకారాత్మకం, సద్భావన, సంవాదం(చర్చలు)’ అన్న ఏడు మంత్రాలను ప్రతి కార్యకర్తా అనుసరించాలని ఆయన కార్యకర్తలకు ఉపదేశించారు. ‘మనకున్న అధికారాన్ని సమాజానికి మేలు చేసేందుకు ఉపయోగించాలి. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఏనాడూ అధికార ఫలాలను తాను అనుభవించలేద’ని మోదీ వ్యాఖ్యానించారు. కోట్లాది కార్యకర్తలకు మేలు చేసేందుకు దశాబ్దాలుగా చేస్తున్నామన్నారు. ‘మనం కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. దేశాన్ని బలోపేతం చేసేందుకు మనం పని చేయాలి. నినాదాలతో ప్రజలు సంతృప్తి చెందరు.’ అని మోదీ వ్యాఖ్యానించారు.