జాతీయ వార్తలు

పిఎస్‌ఎల్‌వి-34 ప్రయోగం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 16: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో పిఎస్‌ఎల్‌వి -సి 34 రాకెట్ ప్రయోగాన్ని వాయిదావేశారు. మూడోదశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని సరిచేయడానికి రెండురోజులపాటు వాయిదా వేశారు. కేంద్రం నుంచి ఈ నెల 20వ తేదీ ప్రయోగించాలనుకున్న పిఎస్‌ఎల్‌వి సి-34 రాకెట్‌లో ఉపగ్రహాలను అమర్చే ప్రక్రియలో గ్యాస్‌ను నింపే పైపులు బుధవారం ఊడిపోయి సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం వాయిదా వేసేందుకు శాస్తవ్రేత్తలు నిర్ణయించారు. ఈ సాంకేతిక లోపాన్ని గురువారం శాస్తవ్రేత్తలు సరిచేయడంతో 22వ తేదీ ప్రయోగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాకెట్ ద్వారా దేశానికి చెందిన కార్టోశాట్ 2సి ఉపగ్రహంతో సహా మరో 19 ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు. ఈ రాకెట్‌ను శుక్రవారం వ్యాబ్ నుంచి ప్రయోగ వేదికకు తరలించనున్నారు. ప్రయోగవేదికపై సాంకేతికంగా పలు పరీక్షలను నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం శుక్రవారం సాయంత్రం లేక శనివారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంఆర్‌ఆర్ అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఈ నెల 20వ తేదీ సాయంత్రం ప్రారంభమై 39.5 గంటలపాటు నిరంతరం సాగిన అనంతరం 22న ఉదయం 9.25గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

చిత్రం రాకెట్‌లోని మూడో దశ