జాతీయ వార్తలు

ట్రిబ్యునల్‌కు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తూ ప్రత్యేకమైన అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా సహా ఆరు రాష్ట్రాలను సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదానికి సంబంధించి అప్పట్లో ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటక రాష్ట్రాలను నాలుగువారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి నదిపై నిర్మిస్తున్న ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేసింది. 1980నాటి గోవావరి ట్రిబ్యునల్ అవార్డుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ ఆరు రాష్ట్రాల న్యాయవాదులు సుప్రీంకు స్పష్టం చేశారు. కేంద్రం కూడా గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఆమోదించడమే కాకుండా సంబంధిత పరీవాహక ప్రాంతాల రాష్ట్రాలను కూడా దానికి కట్టుబడి ఉండాలని కోరింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు విషయంలో తమకు ఎలాంటి విభేదాలు లేవని అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించిన సుప్రీం తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.
ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై ఈ అంశాన్ని చర్చించాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేయడంపై స్పందించిన ధర్మాసనం ‘దీనిపై నిర్ణయం తీసుకోవల్సింది మీరే. వారితో సమావేశం కావాలనుకుంటే జరుపుకోవచ్చు’ అని తెలిపింది. ఈ కేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ఈ రాష్టల్ర సీఎంలు సమావేశం కాకూడదని లేదని న్యాయమూర్తులు అన్నారు.