జాతీయ వార్తలు

ఖట్టర్ పాలన భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జింద్ (హర్యానా), ఫిబ్రవరి 15: బీజేపీ సారథ్యంలోని హర్యానా ప్రభుత్వం నిష్కళంకంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో పాటుపడుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కేంద్ర నిధులన్నీ అవినీతి గోదాలోకి వెళ్లిపోయేవని గురువారం ఇక్కడ ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని ప్రశంసించారు. దీర్ఘకాలం తరువాత రాష్ట్రంలో అవినీతి రహితపాలన వచ్చినందుకు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని, కాంగ్రెస్ పాలనకు తమ పాలనకు మధ్య ఉన్న తేడాను గుర్తించారని ఇక్కడ జరిగిన యువశక్తి ర్యాలీలో షా అన్నారు. ఈ ర్యాలీకి లక్షల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. జింద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ర్యాలీ ద్వారా బీజేపీ తన పట్టును రుజువుచేసుకునే ప్రయత్నం చేసింది. హర్యానా రాజకీయాల్లో ఈ ప్రాంతం అత్యంత కీలకం కావడం పట్ల దీనిపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులే అవినీతికి పాల్పడి జైలుకెళ్లారని, ఖట్టర్‌పై ఏ రకమైన అవినీతి ఆరోపణ ఇప్పటివరకూ రాలేదని అమిత్ షా అన్నారు. ఇప్పుడు కేంద్రం నిధులన్నీ కూడా సక్రమంగా వినియోగమవుతున్నాయని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో బదిలీల పరిశ్రమే నడిచేదని ఇప్పుడు అవకతవకలకు తావులేని విధంగా మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లో నియామకాలు జరుగుతున్నాయని బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.

చిత్రం..హర్యానాలోని జింద్‌లో గురువారం బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా